IND vs PAK: ‘ట్రాక్టర్ అమ్మి టికెట్ కొన్నా భయ్యా.. గుండె బద్దలైంది’.. పాక్ అభిమాని కన్నీళ్లు.. వీడియో

|

Jun 10, 2024 | 5:51 PM

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం (జూన్ 09) జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ లో స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్ లో టీమిండియా ఆరు పరుగులు తేడాతో పాకిస్తాన్ పై విజయం సాధించింది. కాగా ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ సందర్భంగా, అభిమానులు స్టేడియంలో కిక్కిరిసిపోయారు.

IND vs PAK: ట్రాక్టర్ అమ్మి టికెట్ కొన్నా భయ్యా.. గుండె బద్దలైంది.. పాక్ అభిమాని కన్నీళ్లు.. వీడియో
India Vs Pakistan
Follow us on

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం (జూన్ 09) జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ లో స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్ లో టీమిండియా ఆరు పరుగులు తేడాతో పాకిస్తాన్ పై విజయం సాధించింది. కాగా ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ సందర్భంగా, అభిమానులు స్టేడియంలో కిక్కిరిసిపోయారు. స్థానిక క్రికెట్ అభిమానులతో పాటు భారత్, పాక్ లకు చెందిన వేలాది మంది ఈ మ్యాచ్ కు హాజరయ్యారు. ఇలా వెళ్లిపోయిన పాకిస్థాన్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు  టీమిండియా చేతిలో  ఏడోసారి ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత ఓ పాక్ అభిమాని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఈ మ్యాచ్ చూసేందుకు ఒక పాక్ అభిమాని ఏకంగా తన ట్రాక్టర్ అమ్మేసి న్యూయార్క్ వచ్చాడు. 3000 డాలర్ల విలువైన టికెట్ కూడా కొన్నాడు. అంటే ఈ టికెట్ విలువ పాక్ కరెన్సీలో సుమారు రూ.8 లక్షలు కాగా అదే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 2.50 లక్షలు.

ఇలా జరుగుతుందను కోలేదు..

ఇంత ఖరీదైన టికెట్ కొని మ్యాచ్ వీక్షించిన అభిమాని కనీసం ఈసారి అయినా పాక్ జట్టు గెలుస్తుందన్న గట్టి నమ్మకంతో ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 119 పరుగులకే ఆలౌటైంది. దీంతో పాక్ జట్టు విజయం ఖాయమని సదరు అభిమాని భావించారు. కానీ టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు మోకరిల్లారు. ఈ ఓటమి బాధ గురించి పాక్ అభిమాని మాట్లాడుతూ, “నేను US $ 3000 విలువైన టికెట్ కొనడానికి నా ట్రాక్టర్‌ని అమ్మాను. భారత జట్టు స్కోరు చూస్తుంటే ఈ మ్యాచ్‌లో ఓడిపోతామని అనుకోలేదు. మ్యాచ్ మొత్తం మా చేతుల్లోనే ఉంది. కానీ బాబర్ అజామ్ ఔట్ అయిన తర్వాత ప్రజలు నిరాశ చెందారు.. మీ అందరికీ (భారతీయులు) నేను అభినందనలు తెలుపుతున్నాను” అని పాకిస్థాన్ అభిమాని భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మలుపు తిప్పిన బుమ్రా

కాగా భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 15వ ఓవర్లో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. సెట్‌లో రిజ్వాన్‌ను బౌల్డ్ చేసిన బుమ్రా పాకిస్థాన్‌కు గట్టి దెబ్బ ఇచ్చాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా కూడా పాక్ బ్యాటర్ల పని పట్టారు. ఫలితంగా పాకిస్థాన్ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..