
India vs Pakistan ICC T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం (జూన్ 09) ఆదివారం కిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ జట్టు 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఐసీసీ టోర్నీల్లో పాక్ పై భారత్ ఆధిపత్యం కొనసాగించింది. కాగా ఎంతో ఉత్కంఠ పోరు సాగిన ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో పాకిస్థాన్ ఆటగాడు నసీమ్ షా కంటతడి పెట్టుకున్నాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో 9వ ప్లేస్ లో వచ్చిన నసీమ్ షా ఆఖరి ఓవర్లో పోరాట పటిమ ప్రదర్శించాడు. 5 బంతుల్లో 18 పరుగులు అవసరమైన దశలో వరుసగా బౌండరీలు కొట్టాడు.
మొత్తం 4 బంతులు ఎదుర్కొన్న నసీమ్ 2 ఫోర్లతో 10 పరుగులు చేశాడు. అయితే పాక్ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.
టీమ్ ఇండియా 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించడంతో నసీమ్ షా తీవ్ర నిరాశకు లోనయ్యాడు. గ్రౌండ్‌లోనే ఏడ్వడం ప్రారంభించాడు. దీంతో సహచరుడు షాహీన్ అఫ్రిది అతనిని ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత హ్యాండ్‌షేక్ ఇస్తూ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాక్ జట్టు యువ పేసర్‌ను ఓదార్చాడు.
ప్రస్తుతం నసీమ్ షాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే పాక్ క్రికెట్ ప్రేమికులు కూడా యువ ఆటగాడి ఆటతీరును అభినందిస్తున్నారు. ఇవి క్రికెట్ పట్ల నసీమ్ షా ప్రేమకు నిదర్శనమంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..