
Indian Team Possible matches in Super 8: ప్రస్తుతం భారత జట్టు T20 ప్రపంచ కప్‌కు సన్నాహాల్లో పూర్తిగా బిజీగా ఉంది. అయితే సూపర్-8కి వెళ్లడం ద్వారా టీమిండియా ఓటమి చవిచూడాల్సి రావొచ్చు. ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు రికార్డు అంతగా రాణించకపోవడంతో సూపర్-8లో భారత జట్టు రెండు పెద్ద జట్లతో మ్యాచ్‌లు ఆడాల్సి రావడమే ఇందుకు కారణం. ఒకవేళ భారత జట్టు ఓడిపోతే సెమీఫైనల్‌కు చేరుకోవడం కష్టతరమవుతుంది.
T20 వరల్డ్ కప్ 2024 ఫార్మాట్ ఈసారి చాలా భిన్నంగా ఉంది. 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు సూపర్-8కి అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత సూపర్-8 జట్లను రెండు గ్రూపులుగా విభజించి, రెండు గ్రూపుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.
టీమ్ ఇండియాకు స్థానం కల్పించిన గ్రూప్‌లో పాకిస్థాన్, ఐర్లాండ్ వంటి జట్లు కూడా ఉన్నాయి. భారత జట్టు తన గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లు గెలిచి సూపర్-8కి వెళితే, అక్కడ భారత రెండు బలమైన జట్లతో తలపడవచ్చు. సూపర్-8లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడాల్సి రావచ్చు. ఇది కాకుండా మూడో మ్యాచ్ శ్రీలంకతో జరగొచ్చు. భారత జట్టు శ్రీలంకను అధిగమించగలదు. కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రెండు బలమైన జట్లతో చిక్కుల్లో పడొచ్చు. రికార్డులను పరిశీలిస్తే, ఐసీసీ టోర్నీల్లో ఈ రెండు జట్లపై భారత్ ప్రదర్శన అంతగా రాణించలేదు. ఈ కారణంగానే సెమీఫైనల్‌కు చేరుకోవడంలో టీమ్‌ఇండియా మార్గం కష్టమే అవుతంది.
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2024
2007 తర్వాత భారత్ టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలవలేదు. అందుకే ట్రోఫీని ఎలాగైనా గెలవాలని టీమ్ ఇండియాపై ప్రతిసారీ ఒత్తిడి పెరుగుతుంది. గత 11 ఏళ్లుగా టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవలేక పోవడంతో ఒత్తిడి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కూడా భారత జట్టు బాట చాలా కష్టతరంగా మారనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..