మహిళల టీ20 ప్రపంచకప్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత జట్టు తడబడింది . షార్జా వేదికగా ఆదివారం (అక్టోబర్ 14) ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత జట్టు టీ20 ప్రపంచకప్ కల దాదాపుగా చెరిగిపోయింది. అయితే అధికారికంగా కాదు. టీమిండియా సెమీస్ చేరుకోవడానికి కొన్ని అవకాశాలున్నాయి. అంటే టీ20 ప్రపంచకప్ భవితవ్యం టీమిండియా భవితవ్యం నేడు పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో తేలిపోనుంది. గ్రూప్-ఎ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా జట్టు 8 పాయింట్లు సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు రెండో స్థానం కోసం భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా +0.322 నెట్ రన్ రేట్‌తో రెండో స్థానంలో ఉంది. అలాగే న్యూజిలాండ్ +0.282 నెట్ రన్ రేట్‌తో మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్ నెట్ రన్ రేట్ -0.488తో నాలుగో స్థానంలో ఉంది.
ఇక్కడ, భారత్ (+0.322), న్యూజిలాండ్ (+0.282) సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది, అయితే ఆ జట్టేవరో పాకిస్తాన్ నిర్ణయిస్తుంది. అంటే న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫలితం ఇక్కడ నిర్ణయాత్మకం. న్యూజిలాండ్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే.. నెట్ రన్ రేట్ సాయంతో భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒక వేళ న్యూజిలాండ్ గెలిస్తే 6 పాయింట్లతో సెమీస్‌లోకి ప్రవేశిస్తుంది. టీమ్ ఇండియా ఎలిమినేట్ అవుతుంది.ఒక వేళ న్యూజిలాండ్‌పై భారీ తేడాతో గెలిస్తే పాకిస్థాన్ జట్టు కూడా సెమీస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
అంటే టీమ్ ఇండియా సెమీఫైనల్ కు అర్హత సాధించాలంటే న్యూజిలాండ్ జట్టు ఓటమి పాలవ్వాలి. అదే సమయంలో పాకిస్థాన్ జట్టు భారీ తేడాతో గెలవకూడదు. ఈ రెండు సందర్భాల్లోనే నెట్ రన్ రేట్‌లో భారత జట్టు రెండు జట్లను అధిగమించి సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించవచ్చు.
A valiant knock from Captain Harmanpreet Kaur 👏👏#TeamIndia came close to the target but it’s Australia who win the match by 9 runs in Sharjah.
📸: ICC
Scorecard ▶️ https://t.co/Nbe57MXNuQ#T20WorldCup | #INDvAUS | #WomenInBlue pic.twitter.com/jBJJhjSzae
— BCCI Women (@BCCIWomen) October 13, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..