PAK vs NED: టార్గెట్ చిన్నదైనా.. చెమటోడ్చిన పాక్.. నెదర్లాండ్స్‌పై విజయంతో సెమీస్ ఆశలు సజీవం..
రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన పాక్ జట్టు.. ఎట్టకేలకు తొలి విజయం సాధించి, తమ ఖాతాలో పాయింట్లను వేసుకుంది. నెదర్లాండ్స్ అందించిన 92 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 13.5 ఓవర్లలో ఛేదించింది.
టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ జట్టుపై పాకిస్థాన్ 6 వికెట్ల తేడాలో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన పాక్ జట్టు.. ఎట్టకేలకు తొలి విజయం సాధించి, తమ ఖాతాలో పాయింట్లను వేసుకుంది. నెదర్లాండ్స్ అందించిన 92 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 13.5 ఓవర్లలో ఛేదించింది. రిజ్వాన్ హాఫ్ సెంచీర చేయకుండా 49 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. అంతకుముందు నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 91 పరుగులు మాత్రమే చేయగలిగింది. నెదర్లాండ్స్ బ్యాట్స్‌మెన్‌లలో ఇద్దరు మాత్రమే డబుల్ ఫిగర్‌ను దాటగలిగారు. కోలిన్ అకెర్‌మన్ అత్యధికంగా 27 పరుగులు చేయగా, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 15 పరుగులు చేశాడు.
పాకిస్థాన్ తరఫున షాదాబ్ ఖాన్ నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో మహ్మద్ వసీం జూనియర్ మూడు ఓవర్లలో 15 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.