T20 World Cup 2021, PAK vs AUS: టీ20 ప్రపంచకప్ 2021 రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా జట్టు 6 బంతుల్లోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఆస్ట్రేలియా జట్టు ఒకప్పుడు ఓటమి అంచున నిలిచింది. చివరి 5 ఓవర్లలో ఆసీస్ 64 పరుగులు చేయాల్సి ఉండగా, మాథ్యూ వేడ్, మార్కస్ స్టోయినిస్ తుఫాను బ్యాటింగ్ పాకిస్తాన్ టీం నుంచి ఫైనల్ టిక్కెట్‌ను లాగేసుకుంది.
కాగా, హసన్ అలీ పేలవమైన ఫీల్డింగ్ కూడా పాకిస్థాన్ ఓటమిలో కీలక పాత్ర పోషించింది. 19వ ఓవర్‌లో మాథ్యూ వేడ్ క్యాచ్‌ను హసన్ అలీ జారవిడిచాడు. ఆ తర్వాత ఈ కంగారూ బ్యాట్స్‌మెన్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి ఆస్ట్రేలియాను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. హసన్ అలీ చేసిన తప్పిదానికి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం ఈ బౌలర్‌నే ఓటమికి కారణమంటూ పేర్కొన్నాడు.
హసన్ అలీ చేసిన భారీ తప్పిదం..
బాబర్ ఆజం 19వ ఓవర్లో షాహీన్ అఫ్రిదిని బౌలింగ్‌కు దించాడు. ఆస్ట్రేలియా విజయానికి 22 పరుగులు చేయాల్సి ఉంది. షాహీన్ వేసిన తొలి బంతికే స్టోయినీస్ పరుగులేమీ చేయలేదు. అయితే రెండో బంతికే స్టోయినిస్ సింగిల తీశాడు. ఆ తర్వాత, హసన్ అలీతో మ్యాచ్‌ను ఓడించడానికి మూడవ బంతికి పొరపాటు జరిగింది. మూడో బంతికి వేడ్ మిడ్ వికెట్ వైపు షాట్ ఆడాడు. బంతి నేరుగా హసన్ అలీ చేతుల్లోకి వెళ్లింది. అయితే ఈ ఆటగాడు చాలా సులభమైన క్యాచ్‌ను జారవిడిచాడు. వేడ్ రెండు పరుగులతో పాటు ఓ కీలక లైఫ్ అందుకున్నాడు. దీని తర్వాత, మాథ్యూ వేడ్ షహీన్ అఫ్రిదిని చితక బాదేశాడు. మూడు వరుస బంతుల్లో మూడు సిక్సర్లతో పాకిస్తాన్ నుండి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. హసన్ అలీ బౌలింగ్‌లో కూడా ఖరీదైనదని నిరూపించుకున్నాడు. అతను 4 ఓవర్లలో 44 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. 19వ ఓవర్లో షాహీన్ అఫ్రిది కూడా పేలవంగా బౌలింగ్ చేసినా.. ఓటమికి హసన్ అలీ కారణమని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఆరోపించాడు.
ఓటమికి హసన్ అలీనే కారణం..
మ్యాచ్ ముగిసిన తర్వాత బాబర్ అజామ్‌ను ఓటమికి కారణాలు అడగగా.. హసన్ అలీ క్యాచ్‌ను వదిలిపెట్టడమే పెద్ద కారణం అంటూ చెప్పుకొచ్చాడు. హసన్ అలీ క్యాచ్ పట్టి ఉంటే కొత్త బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చేవాడని, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచి ఉండేదని బాబర్ పేర్కొన్నాడు. హసన్ అలీకి వ్యతిరేకంగా బాబర్ ఆజం బహిరంగ ప్రకటన చేశాడు. ఆ తర్వాత పాక్ కెప్టెన్‌పై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Oh i think so today the title of ‘man of
the match’ is for Hasan ali sir. pic.twitter.com/s9SpLM8atF— omi (@sid_dhamankar) November 11, 2021
Also Read: Watch Video: ‘అంపైర్ కిల్లర్’ బాల్‌ని చూశారా? తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వైరలవుతోన్న వీడియో