T20 World Cup 2021, PAK vs AUS: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 రెండవ సెమీ-ఫైనల్‌లో, ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. న్యూజిలాండ్‌తో తలపడనున్న ఆస్ట్రేలియా జట్టు టీ20 ప్రపంచకప్‌లో రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. నవంబర్ 14 ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్‌లో రెండు జట్ల మధ్య 2015 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పునరావృతం కానుంది. ఆ ఫైనల్‌కు ముందు, అదే మైదానంలో టైటిల్ పోటీదారులైన పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. ఇందులో జట్టు వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ మాథ్యూ వేడ్ కీలక పాత్ర పోషించాడు.
పాకిస్థాన్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా 96 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వేడ్, మార్కస్ స్టోయినిస్‌తో కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు 6 బంతుల్లో విజయాన్ని అందించాడు. షాహీన్ ఆఫ్రిదిపై 19వ ఓవర్ చివరి 3 బంతుల్లో మూడు వరుస సిక్సర్లతో సహా వేడ్ కేవలం 17 బంతుల్లో 41 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు.
క్లిష్ట పరిస్థితుల్లో వేడ్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. అయితే వేడ్ కెరీర్ నిజంగా కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడం, వాటిని అధిగమించి నేడు ఆస్ట్రేలియాలో హీరోగా మారాడు. టాస్మానియాలోని హోబర్ట్‌లో జన్మించిన మాథ్యూ వేడ్ కలర్ బ్లైండ్ కలవాడు. అంటే రంగులను సరిగ్గా గుర్తించలేకపోతుంటాడు. ఇదిలాఉంటే, గత దశాబ్ద కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో స్తంభించిపోయాడు. ఇది మాత్రమే కాదు 16 సంవత్సరాల వయస్సులో వృషణాల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీని తర్వాత అతను రెండుసార్లు కీమోథెరపీ చేయించుకున్నాడు. అయినా వేడ్ క్రికెట్‌ను వదిలిపెట్టలేదు. క్రికెట్‌లోనే తనను తాను మెరుగుపరుచుకోవాలని నిశ్చయించుకున్నాడు.
వేడ్ హోబర్ట్‌కు చెందినవాడు. అయితే అతను వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్‌గా టాస్మానియా ఫస్ట్-క్లాస్ జట్టులో చోటును కనుగొనడం కష్టంగా ఉండేది. ఎందుకంటే అతని సహచరుడు టిమ్ పైన్ జట్టులోకి ఎంపిక కావడంతో వెనుకంజలోనే ఉండిపోయాడు. అటువంటి పరిస్థితిలో వేడ్ టాస్మానియాను విడిచిపెట్టి విక్టోరియాకు వెళ్లాడు. అక్కడ అతను జట్టు చీఫ్ వికెట్ కీపర్ అయ్యాడు. దాదాపు 10 సంవత్సరాలు ఈ జట్టులో భాగమయ్యాడు. ఆ తర్వాత 2016-17లో టాస్మానియా నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు.
2011లో దక్షిణాఫ్రికాపై టీ20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా తరఫున వేడ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదే సమయంలో, ఫిబ్రవరి 2012లో వేడ్ తన కెరీర్‌ను మొదట భారత్‌తో వన్డేల్లో ప్రారంభించాడు. ఆపై అదే సంవత్సరం ఏప్రిల్‌లో వెస్టిండీస్‌పై బరిలోకి దిగాడు. అయినప్పటికీ, జట్టులోని ఇతర కీపర్ల ప్రదర్శన సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్‌కు నచ్చడంతో, వేడ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. అయితే 2019 ఇంగ్లండ్‌లో ఆడిన యాషెస్ సిరీస్‌లో వేడ్ రెండు సెంచరీలు సాధించాడు. అప్పటి నుంచి అతను జట్టులో ముఖ్యమైన భాగంగా ఉన్నాడు.
33 ఏళ్ల మాథ్యూ వేడ్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరపున 36 టెస్టులు, 97 వన్డేలు, 54 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను మొత్తం 4200 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అతని కెరీర్‌లో ఇప్పటివరకు, వేడ్ 4 టెస్టులు, 1 వన్డే సెంచరీ సాధించగా, అతను 19 అర్ధ సెంచరీలు కూడా చేశాడు.
? Haris Rauf’s low diving catch
? Fakhar Zaman’s 50 with a six
? Matthew Wade’s triple sixesVote for your @nissan #POTD for Semi-final 2 ?️https://t.co/a1rjp1pAxn pic.twitter.com/ejEQT0QEWX
— ICC (@ICC) November 11, 2021
Watch Video: ‘అంపైర్ కిల్లర్’ బాల్‌ని చూశారా? తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వైరలవుతోన్న వీడియో