T20 World Cup 2021, IND vs PAK: ఈ ఏడాది T20 World Cup 2021లో ప్రపంచమంతా ఆసక్తిగా ఎదరుచూసిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అందరి అంచనాలకు వ్యతిరేకంగా సాగింది. టీమిండియా ఈ మ్యాచులో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం సాధించింది. ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోవడం తొలిసారి కావడం గమనార్హం. 2007 తర్వాత తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో భారత జట్టు ఓడిపోయింది. ఇంతకుముందు భారత్ ఐదుసార్లు గెలుపొందగా, పాకిస్థాన్ తొలిసారి విజయం సాధించింది. అయితే ఇప్పుడు భారత్, పాకిస్థాన్‌లు మరోసారి టీ20 ప్రపంచ కప్ 2021లో తలపడే ఛాన్స్ ఉంది. అది ఎలానో తెలుసుకుందాం..
గత కొన్నేళ్లుగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో రెండు దేశాల మధ్య సిరీస్‌లు జరగలేదు. అయితే ఐసీసీ ట్రోఫీలలో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ తలపడ్డాయి. 2019 ప్రపంచకప్ తర్వాత ఇరు జట్లు తొలిసారి ఆడాయి. ఈలోగా ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్లు మరోసారి తలపడే ఛాన్స్ ఉంది. దాయాదులు రెండూ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడాయి. మరో నాలుగు మ్యాచులు మిగిలి ఉన్నాయి. మిగతా మ్యాచుల్లో రాణించి, ఈ రెండు జట్లూ సెమీఫైనల్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. అక్కడ కూడా గెలిస్తే.. ఇక టీ20 ప్రపంచ కప్ 2021 ఫైనల్లో మరోసారి భారత్, పాకిస్తాన్ జట్లు తలపడే ఛాన్స్ ఉంది. ఇది జరగాలంటే టీమిండియా మిగతా మ్యాచ్‌ల్లో రాణించాల్సి ఉంటుంది.
10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ విజయం..
సూపర్ 12లో భాగంగా ఆదివారం జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన బాబర్ సేన బౌలింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్, రాహుల్ లు 0, 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. మ్యాచ్ మొత్తంలో విరాట్, రిషబ్ మాత్రమే పోరాడారు. కోహ్లీ 57, పంత్ 39 పరుగులు చేశారు. ఆ తర్వాత ఎవరూ రాణించకపోవడంతో మొత్తం జట్టు ఇన్నింగ్స్ 20 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది.
152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు మైదానంలోకి దిగిన పాకిస్తాన్ టీం.. బ్యాటింగ్‌లో ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించి భారత బౌలర్లను ఆడుకున్నారు. ఓపెనర్లు బాబర్ అజామ్, రిజ్వాన్ ఇద్దరూ అద్భుతమైన అర్ధ సెంచరీలు చేశారు. బాబర్ 52 బంతుల్లో 68 పరుగులు, రిజ్వాన్ 55 బంతుల్లో 79 పరుగులు చేసి వికెట్ నష్టపోకుండా విజయం సాధించారు. భారత బౌలర్లలో ఒక్కరూ కూడా ఆకట్టుకోలేకపోయారు. దీంతో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Also Read: Anushka Sharma: ఆటగాళ్ల భార్యలనూ వదలని ట్రోలర్స్.. అనుష్క శర్మను తాకిన టీమిండియా ఓటమి సెగ
Ind vs Pak: మీ ఆటగాళ్లను గౌరవించండి.. అవమానించొద్దు: షమీకి మద్దతుగా పాక్ ఓపెనర్ ట్వీట్