20 బంతుల్లో పెను విధ్వంసం.. 240 స్ట్రైక్‌రేట్‌తో తుఫాన్ ఇన్నింగ్స్.. దంచికొట్టిన ఆ ప్లేయర్ ఎవరంటే!

|

Jun 20, 2022 | 4:28 PM

ఈ టోర్నీలో నిన్న డెర్బీషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. యార్క్‌షైర్‌ జట్టు బ్యాటింగ్ పూర్తి చేసిన వెంటనే వర్షం..

20 బంతుల్లో పెను విధ్వంసం.. 240 స్ట్రైక్‌రేట్‌తో తుఫాన్ ఇన్నింగ్స్.. దంచికొట్టిన ఆ ప్లేయర్ ఎవరంటే!
Deploy
Follow us on

ప్రస్తుతం దక్షిణాఫ్రికా జాతీయ జట్టు.. భారత్‌లో పర్యటించగా.. ఆ దేశానికి చెందిన ఓ ఆటగాడు మాత్రం ఇంగ్లాండ్‌లో తన బ్యాట్‌తో విజృంభిస్తున్నాడు. ఇంగ్లాండ్‌లో టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నీలో నిన్న డెర్బీషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. యార్క్‌షైర్‌ జట్టు బ్యాటింగ్ పూర్తి చేసిన వెంటనే వర్షం.. మ్యాచ్‌కు అడ్డంకిగా మారింది. దీనితో అంపైర్లు డక్‌వర్త్‌-లూయిస్ పద్దతిని అమలులోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో.. డెర్బీషైర్‌కు 10 ఓవర్లలో 105 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించారు.

20 బంతుల్లోనే పెను విధ్వంసం..

ఓ బ్యాటర్ చెలరేగిపోయాడు. దక్షిణాఫ్రికాకు చెందిన 27 ఏళ్ల లూస్ డుప్లాయ్.. 240 స్ట్రైక్ రేట్‌తో 20 బంతుల్లో 48 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. డెర్బీషైర్‌ చివరి 6 బంతుల్లో 19 పరుగులు చేయాల్సి ఉంది. డుప్లాయ్ (6,4,6,2,wide) వరుస బౌండరీలతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు. లాస్ట్ బంతికి సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. దీనితో డెర్బీషైర్‌ 6 వికెట్ల తేడాతో యార్క్‌షైర్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది.