RCB vs PBKS: ఆర్సీబీ కుర్రాడి దెబ్బకు అల్లాడిన ఆసీస్ ఆటగాళ్లు! ఒకే ఓవర్‌లో ఇద్దరిని మడతెట్టేశాడుగా..
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ బౌలర్లు పంజాబ్ కింగ్స్ పై అద్భుతంగా బౌలింగ్ చేశారు. యువ స్పిన్నర్ సుయాష్ శర్మ ఒకే ఓవర్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు జోష్ ఇంగ్లిష్, మార్కస్ స్టోయినిస్‌లను క్లీన్ బౌల్డ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సుయాష్ శర్మ భవిష్యత్తులో టీమ్ ఇండియాలో చోటు సంపాదించే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2025లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఈ నెల 18న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టును 95 పరుగులకే కట్టడి చేసిన పంజాబ్‌పై పగ బట్టి బరిలోకి దిగారో ఏమో కానీ.. ఆర్సీబీ బౌలర్లు పంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యాతో పాటు యువ స్పిన్నర్ సుయాష్ శర్మ అయితే సూపర్ గా బౌలింగ్ చేశారు.
ముఖ్యంగా సుయాష్ శర్మ గురించి మాట్లాడుకుంటే.. ఒకే ఓవర్‌లో ఇద్దరు డేంజరస్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. అందులోనా మరో విశేషం ఏంటంటే.. వాళ్లిద్దరూ కూడా ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లే. జోష్ ఇంగ్లిష్, మార్కస్ స్టోయినీస్. ఇద్దర్ని ఒకే ఓవర్‌లో అవుట్ చేసి ఆర్సీబీని మ్యాచ్‌లో మరింత స్ట్రాంగ్ చేశాడు. హైలెట్ ఏంటంటే.. ఇద్దరూ కూడా సుయాష్ బౌలింగ్‌ను ఏమాత్రం అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యారు. ముందుగా జోష్ ఇంగ్లిస్ 16 బంతుల్లో 29 పరుగులు చేసి మంచి జోష్‌లో ఉన్నాడు. ఆల్రెడీ క్రీజ్‌లో సెట్ అయి ఉన్న బ్యాటర్‌ను ఇన్నింగ్స్ 14వ ఓవర్ రెండు బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు.
దీంతో 17 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ 29 రన్స్ చేసి క్రూషియల్ టైమ్‌లో అవుట్ అయ్యాడు ఇంగ్లిష్. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన స్టోయినీస్‌ను ఇన్నింగ్స్ ఐదో బాల్‌కు క్లీన్ బౌల్డ్ చేశాడు. అసలు అక్కడ ఏం జరిగిందో కూడా స్టోయినీస్‌కు అర్థం కాలేదు. సుయాష్ దెబ్బకు అతని మైండ్ బ్లాంక్ అయినట్లు ఉంది. ఏది ఏమైనా.. ఓ భారత యువ స్పిన్నర్ బౌలింగ్‌లో ఇద్దరు ఆసీస్ ఆటగాళ్లు ఒకే ఓవర్‌లో క్లీన్ బౌల్డ్ కావడం మాత్రం ఇండియన్ స్పిన్ బలాన్ని మరోసారి రుజువుచేసింది. సుయాష్ త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తే.. ఫారెన్ బ్యాటర్లకు ఇబ్బందులు తప్పేలా లేవు.
I.C.Y.M.I
On Target 🎯
Suyash Sharma’s twin strikes that put #RCB in front ✌
Scorecard ▶ https://t.co/6htVhCbTiX#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/AaENClNFCk
— IndianPremierLeague (@IPL) April 20, 2025
Suyash warne sharma deserves more hype ❤️ pic.twitter.com/pqxd22n4Ro
— Kevin (@imkevin149) April 20, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




