Asia Cup 2022: ఆసియాకప్ నుంచి భారత్, ఆఫ్గానిస్తాన్ జట్లు నిష్ర్కమించాయి. గురువారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా ఏకపక్ష విజయం సాధించింది. ఏకంగా 101 పరుగుల తేడాతో భారీ గెలుపు అందుకుంది. చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ఈ మ్యాచ్‌లో ప్రధాన హైలైట్. సుమారు 1021 రోజుల తర్వాత అతను ఓ మ్యాచ్‌లో మూడంకెల స్కోరు చేశాడు. అలాగే కేఎల్ రాహుల్ , రిషబ్ పంత్ కూడా విరాట్‌కు మంచి సహకారం అందించారు . కాగా, మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ త్వరగానే ఔటయ్యాడు. ఎదుర్కొన్న మొదటి బంతిని భారీ సిక్సర్ బాదిన అతను అదే ఊపులో రెండో బంతిని కొట్టబోయి బౌల్డయ్యాడు. అయితే ఈ సిక్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఫరీద్ అహ్మద్ వేసిన13వ ఓవర్ 5వ బంతిని నేరుగా ఫైన్‌లెగ్ దిశలో నేరుగా స్టాండ్స్‌లోకి తరలించాడు సూర్య. అయితే ఆ బంతి డైరెక్టుగా ఆఫ్ఘనిస్తాన్ డగౌట్‌లోని ఫ్రిజ్‌కు తగిలింది. దీంతో ఫ్రిజ్ పైన ఉన్న గ్లాస్ పగిలిపోయింది . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . అయితే అనూహ్యంగా తర్వాతి బంతికే సూర్య పెవిలియన్ చేరాడు . కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ సాయంతో 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది భారత జట్టు . లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ఆఫ్ఘనిస్థాన్.. భువనేశ్వర్ స్వింగ్ అటాక్‌తో కుప్పకూలింది . 21 పరుగులకు ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయింది . ఇబ్రహీం జడార్న్ 64 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు . చివర్లో రషీద్ ఖాన్ 15 పరుగులు, ముజీబ్ ఉర్ రెహమాన్ 18 పరుగులు చేశారు . చివరకు ఆఫ్ఘన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది . భారత్ తరఫున భువనేశ్వర్ 5 వికెట్లతో మెరిశాడు.
#INDvsAFG pic.twitter.com/DuEdBrNRUj
— Sanju Here ?? (@me_sanjureddy) September 8, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..