Suryakumar Yadav: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన మిస్టర్ 360.. ప్రమోషన్‌కు టైం ఇదేనంటూ..

Suryakumar Yadav Family: సూర్యకుమార్ యాదవ్, దేవిశా శెట్టి 2016లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు తమ ప్రేమను, అనురాగాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానుల మన్ననలు పొందారు. క్రికెట్ కెరీర్‌లో దూసుకుపోతున్న సూర్యకుమార్ యాదవ్, వ్యక్తిగత జీవితంలోనూ ఈ శుభవార్తతో మరింత సంతోషంగా ఉన్నారు.

Suryakumar Yadav: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన మిస్టర్ 360.. ప్రమోషన్‌కు టైం ఇదేనంటూ..
Surya Kumar Yadav Family

Updated on: Jul 14, 2025 | 2:51 PM

Suryakumar Yadav Family: భారత క్రికెట్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ (SKY), అతని భార్య దేవిశా శెట్టి త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని సూచిస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇటీవల ఒక టీవీ షోలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ జంట తమ కుటుంబ విస్తరణ గురించి ఆసక్తికరమైన సంకేతాలను ఇచ్చారు.

భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, అతని భార్య గీతా బస్రా హోస్ట్ చేస్తున్న ‘హూ ఈజ్ ది బాస్’ అనే షోలో సూర్యకుమార్ యాదవ్, దేవిశా శెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లల గురించి అడిగిన ప్రశ్నకు దేవిశా స్పందిస్తూ, “ఇదే సరైన సమయం” (This is the right time) అని నవ్వూతూ సమాధానం ఇచ్చింది. సూర్యకుమార్ యాదవ్ కూడా “కుటుంబ ఒత్తిడి లేదని, లైఫ్ సెటిల్ చేసుకోవాలని అనుకున్నామని, ఇప్పుడు అంతా సెట్ అయిందని, ఇది పర్ఫెక్ట్ టైమ్” అని వ్యాఖ్యానించాడు.

వీరిద్దరి మాటలు, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే, త్వరలోనే వారి కుటుంబంలోకి కొత్త సభ్యుడు రాబోతున్నారని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సూర్యకుమార్ యాదవ్ అభిమానులు, క్రికెట్ ప్రియులు ఈ వార్త పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సూర్యకుమార్ యాదవ్, దేవిశా శెట్టి 2016లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు తమ ప్రేమను, అనురాగాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానుల మన్ననలు పొందారు. క్రికెట్ కెరీర్‌లో దూసుకుపోతున్న సూర్యకుమార్ యాదవ్, వ్యక్తిగత జీవితంలోనూ ఈ శుభవార్తతో మరింత సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ తన గాయం నుంచి కోలుకుంటూ, అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ దశలో ఈ శుభవార్త అతని కుటుంబానికి మరింత ఆనందాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..