Youngest Players to hit IPL Century: ఐపీఎల్‌లో శుక్రవారం (ఏప్రిల్ 14) జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ సెంచరీ చేయడం ద్వారా తన పేరును ప్రత్యేక రికార్డు జాబితాలో చేర్చాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా ఐపీఎల్‌లో సెంచరీ చేసిన నాలుగో అతి పిన్న వయస్కుడైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో అతని కంటే ముందు ఈ లిస్టులో ముగ్గురు వెటరన్ ఆటగాళ్లు చేరారు.
ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన విదేశీ బ్యాట్స్‌మెన్‌గా క్వింటన్ డికాక్ నిలిచాడు. క్వింటన్ కేవలం 23 ఏళ్ల 122 రోజుల వయసులో ఐపీఎల్‌లో సెంచరీ సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అతను ఈ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక్కడ ఆస్ట్రేలియన్ వెటరన్ డేవిడ్ వార్నర్ రెండో స్థానంలో ఉన్నాడు. వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతూ 23 ఏళ్ల 153 రోజుల వయసులో సెంచరీ సాధించాడు.
ఈ రికార్డు జాబితాలో మూడో స్థానం ప్రొటీస్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్‌ది. మిల్లర్ 23 ఏళ్ల 330 రోజుల వయసులో ఐపీఎల్‌లో సెంచరీ ఆడాడు. మిల్లర్ అప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రత్యేక జాబితాలో హ్యారీ బ్రూక్ కూడా చేరిపోయాడు. అతను నాలుగో స్థానంలో ఉన్నాడు. బ్రూక్ 24 ఏళ్ల 51 రోజుల వయసులో ఐపీఎల్‌లో సెంచరీ సాధించాడు.
ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో సెంచరీ సాధించిన లిస్టులో మనీష్ పాండే 9వ స్థానంలో ఉన్నాడు. అదేమిటంటే.. ముగ్గురు విదేశీ బ్యాట్స్‌మెన్‌లతో పాటు ఐదుగురు భారత బ్యాట్స్‌మెన్‌లు కూడా ఐపీఎల్‌లో తక్కువ వయసులో సెంచరీలు సాధించారు. మనీష్ పాండే, రిషబ్ పంత్, దేవదత్ పడికల్, సంజూ శాంసన్‌లు ఈ జాబితాలో ఉన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..