IPL 2024 Winner: పాపం కోహ్లీ.. ఈ ఐపీఎల్‌లోనూ ఆర్‌సీబీకి ఓటమే.. విజేతగా హైదరాబాద్ టీం.. అసలు విషయం తెలిస్తే షాకే

Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad: ఐపీఎల్ (IPL) 2016 ఫైనల్‌లో RCB వర్సెస్ SRH జట్లు తలపడ్డాయి. ఆ రోజు తొలుత బ్యాటింగ్ చేసిన డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని SRH జట్టు 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విరాట్ కోహ్లి నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.

IPL 2024 Winner: పాపం కోహ్లీ.. ఈ ఐపీఎల్‌లోనూ ఆర్‌సీబీకి ఓటమే.. విజేతగా హైదరాబాద్ టీం.. అసలు విషయం తెలిస్తే షాకే
Ipl 2024

Updated on: Jan 14, 2024 | 10:57 AM

Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad: అహ్మదాబాద్‌లో జరిగిన ఇండియన్ పతంగ్ లీగ్ (Indian Patang League)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచింది. మకర సంక్రాంతి, లోహ్రీ పండుగ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్ నిర్వహించిన ఈ గాలిపటాల పోటీలో IPL 10 జట్ల అభిమానులు పోటీ పడ్డారు. దీని ప్రకారం ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తలపడ్డారు. తీవ్ర ఉత్కంఠగా నిలిచిన ఫైనల్ పోరులో SRH పైచేయి సాధించింది. RCB ఓడిపోయింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇండియన్ పతంగ్ లీగ్ 2024 విజేతగా నిలిచింది.

విశేషమేమిటంటే 2016 IPL ఫైనల్‌లో RCB, SRH జట్లు తలపడ్డాయి. ఆ రోజు తొలుత బ్యాటింగ్ చేసిన డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని SRH జట్టు 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విరాట్ కోహ్లి నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కేవలం 8 పరుగుల తేడాతో ఓడిపోయి తొలిసారి ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది.

ఇప్పుడు ఇండియన్ పతంగ్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. దీని ద్వారా 2016 ఆర్సీబీ ఓటమి చేదు ఘటన మళ్లీ గుర్తుకు వచ్చింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లొమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, మోహమ్ దీప్ , మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరణ్, లక్కీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిక్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్‌హాక్ ఫరూఖీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, పాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, జాతవేద్ సుబ్రమణియన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..