SRH vs GT Highlights, IPL 2025: గుజరాత్ హ్యాట్రిక్ విక్టరీ.. సొంత మైదానంలో ఎస్‌ఆర్‌హెచ్ ఘోర పరాజయం

Sunrisers Hyderabad vs Gujarat Titans, 19th Match Highlights in Telugu: ఐపీఎల్ 2025 20వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్‌కు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది.

SRH vs GT Highlights, IPL 2025: గుజరాత్ హ్యాట్రిక్ విక్టరీ.. సొంత మైదానంలో ఎస్‌ఆర్‌హెచ్ ఘోర పరాజయం
Sunrisers Hyderabad Vs Gujarat Titans, 19th Match

Updated on: Apr 06, 2025 | 11:03 PM

Sunrisers Hyderabad vs Gujarat Titans, 19th Match Highlights in Telugu: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ఆతిథ్య జట్టు గుజరాత్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. గుజరాత్ వరుసగా మూడో మ్యాచ్‌లో విజయం సాధించింది.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన హైదరాబాద్ అందించిన 153 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ 61 పరుగులతో అజేయంగా నిలిచాడు. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ 49 పరుగులు చేశాడు. మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టగా, కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక వికెట్ తీశాడు.

గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి (31 పరుగులు),హెన్రిచ్ క్లాసెన్ (27 పరుగులు) ఏకైక యాభై భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ద్ కృష్ణ, సాయి కిషోర్ చెరో 2 వికెట్లు తీశారు.

ఇరు జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ.

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(కీపర్), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.

రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు:

లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, అర్షద్ ఖాన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్లు: అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, సిమర్‌జీత్ సింగ్, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 06 Apr 2025 10:57 PM (IST)

    గుజరాత్ హ్యాట్రిక్ విక్టరీ..

    సొంత మైదానంలో ఉప్పల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోర పరాజయం పాలైంది. గుజరాత్‌తో జరిగిన ఈమ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

  • 06 Apr 2025 10:36 PM (IST)

    గిల్ హాఫ్ సెంచరీ

    గుజరాత్ 13 ఓవర్లలో రెండు వికెట్లకు 106 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నారు. గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు. సుందర్‌తో అర్థ శతక భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు.


  • 06 Apr 2025 10:15 PM (IST)

    దంచి కొడుతోన్న గిల్, సుందర్

    గుజరాత్ 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నారు.

  • 06 Apr 2025 09:56 PM (IST)

    2 వికెట్లు కోల్పోయిన గుజరాత్

    గుజరాత్ 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. కెప్టెన్లు శుభ్‌మాన్ గిల్, వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నారు. జోస్ బట్లర్ (0)ని పాట్ కమిన్స్, సాయి సుదర్శన్ (5 పరుగులు)ను మహ్మద్ షమీ అవుట్ చేశారు.

  • 06 Apr 2025 09:42 PM (IST)

    వేగం పెంచిన గుజరాత్ ఓపెనర్స్

    గుజరాత్ 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ క్రీజులో ఉన్నారు.

  • 06 Apr 2025 09:21 PM (IST)

    గుజరాత్ టార్గెట్ 153

    గుజరాత్ కు హైదరాబాద్ 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. చివరి ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ 17 పరుగులు ఇచ్చాడు. పాట్ కమ్మిన్స్ తన ఓవర్లో ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టాడు. షమీ కూడా అతనిపై ఒక ఫోర్ కొట్టాడు.

  • 06 Apr 2025 09:06 PM (IST)

    6వ వికెట్ డౌన్

    18 ఓవర్లలో హైదరాబాద్ 6 వికెట్లకు 132 పరుగులు చేసింది. అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ క్రీజులో ఉన్నారు.

  • 06 Apr 2025 08:48 PM (IST)

    నితీష్ ఔట్

    15.1 ఓవర్లలో హైదరాబాద్ 5 వికెట్లకు 105 పరుగులు చేసింది. అనికేత్ వర్మ, కమిండు మెండిస్ క్రీజులో ఉన్నారు. సాయి కిషోర్ నితీష్ కుమార్ రెడ్డి (31 పరుగులు), హెన్రిచ్ క్లాసెన్ (27 పరుగులు) వికెట్లు పడగొట్టాడు.

  • 06 Apr 2025 08:40 PM (IST)

    4వ వికెట్ డౌన్

    14 ఓవర్లలో హైదరాబాద్ 4 వికెట్లకు 101 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ క్రీజులో ఉన్నారు. హెన్రిచ్ క్లాసెన్ (27 పరుగులు)ను సాయి సుదర్శన్ ఔట్ చేశాడు.

  • 06 Apr 2025 08:33 PM (IST)

    3 వికెట్లు డౌన్

    13 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ మూడు వికెట్లకు 89 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ క్రీజులో ఉన్నారు. ఇషాన్ కిషన్ (17 పరుగులు)ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేశాడు.

  • 06 Apr 2025 08:00 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    5.4 ఓవర్లలో హైదరాబాద్ రెండు వికెట్లకు 42 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్లో ట్రావిస్ హెడ్‌ను, 5వ ఓవర్లో అభిషేక్ శర్మను మహమ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. హెడ్ ​​8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అభిషేక్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీనితో, సిరాజ్ ఐపీఎల్‌లో 100 వికెట్లు కూడా పూర్తి చేశాడు.

  • 06 Apr 2025 07:39 PM (IST)

    హెడ్ ఔట్

    హైదరాబాద్ ఒక ఓవర్ పూర్తయ్యే సరికి ఒక వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్లోనే సాయి సుదర్శన్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్‌ మహ్మద్ సిరాజ్ క్యాచ్ ఇచ్చాడు. హెడ్ ​​2 ఫోర్ల సహాయంతో 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

  • 06 Apr 2025 07:13 PM (IST)

    రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు:

    లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, అర్షద్ ఖాన్.

    సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్లు: అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, సిమర్‌జీత్ సింగ్, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్.

  • 06 Apr 2025 07:11 PM (IST)

    గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI:

    సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(కీపర్), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.

  • 06 Apr 2025 07:11 PM (IST)

    సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI:

    ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ.

  • 06 Apr 2025 07:04 PM (IST)

    టాస్ గెలిచిన గుజరాత్

    గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అర్షద్ ఖాన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు జట్టులో అవకాశం లభించింది. అదే సమయంలో, హర్షల్ పటేల్ స్థానంలో జయదేవ్ ఉనద్కత్ కు హైదరాబాద్ అవకాశం ఇచ్చింది.

  • 06 Apr 2025 06:49 PM (IST)

    పిచ్ రిపోర్ట్..

    రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అధిక స్కోరింగ్ మ్యాచ్‌లను ఇక్కడ చూడొచ్చు. ఈ స్టేడియంలో ఇప్పటివరకు 79 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో 35 మ్యాచ్‌లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచాయి. 44 మ్యాచ్‌లు ఛేజింగ్ చేసిన జట్టు గెలిచింది. 

  • 06 Apr 2025 06:44 PM (IST)

    హ్యాట్రిక్ విజయాలు

    రెండు జట్ల మధ్య జరిగిన చివరి మూడు మ్యాచ్‌ల్లో గుజరాత్ విజయం సాధించింది. అదే సమయంలో, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రెండు జట్లు రెండోసారి తలపడనున్నాయి. మునుపటి మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దు అయింది.

  • 06 Apr 2025 06:37 PM (IST)

    గుజరాత్‌దే పైచేయి..

    ఇప్పటివరకు హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మధ్య 5 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో 3 గుజరాత్ గెలిచింది. 1 మ్యాచ్‌లో హైదరాబాద్ మాత్రమే గెలిచింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దు అయింది.

  • 06 Apr 2025 06:32 PM (IST)

    దూసుకెళ్తోన్న గుజరాత్

    గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయాలు సాధించాలని చూస్తోంది. పంజాబ్ కింగ్స్ పై ఓటమితో తన ప్రచారాన్ని ప్రారంభించిన గుజరాత్.. తన రెండో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ (MI) ను, మూడో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ను ఓడించింది.

  • 06 Apr 2025 06:24 PM (IST)

    5వ మ్యాచ్ ఆడనున్న హైదరాబాద్

    హైదరాబాద్‌కు ఇది ఐదవ మ్యాచ్ కాగా, గుజరాత్‌కు నాల్గవ మ్యాచ్ అవుతుంది. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ (RR)ను 44 పరుగుల తేడాతో ఓడించింది. అయితే, ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

  • 06 Apr 2025 06:16 PM (IST)

    ఉప్పల్‌లో 19వ మ్యాచ్

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా 19వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.