కాటేరమ్మ కొడుకులమంటూ ఫోజులు.. కట్‌చేస్తే.. 7 మ్యాచ్‌లకే సీన్ రివర్స్.. 300లంటూ కావ్యకే కన్నీళ్లు తెప్పించారుగా

Sunrisers Hyderabad Qualification Scenario For Playoffs: మిగిలిన ఏడు మ్యాచ్‌లలో గెలిస్తే బర్త్‌కి ఢోకా లేనట్లే. మూడు కంటే ఎక్కువ ఓటములు ఎదురైతే మాత్రం బ్యాగ్‌లు సర్దుకోవాల్సిందే. ఇకపై హైదరాబాద్ జట్టు కఠినమైన మ్యాచ్‌లను ఎదుర్కోనుంది. ఈ క్రమంలో కాటేరమ్మ కొడుకులమంటూ ముద్దుగా పిలిచుకుంటున్న హైదరాబాద్ డేంజరస్ ప్లేయర్లు అభిషేక్ వర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ ఫాంలోకి రావాలి. లేదంటే ఫ్యాన్స్‌కు నిరాశ.

కాటేరమ్మ కొడుకులమంటూ ఫోజులు.. కట్‌చేస్తే.. 7 మ్యాచ్‌లకే సీన్ రివర్స్.. 300లంటూ కావ్యకే కన్నీళ్లు తెప్పించారుగా
Srh Playoffs Qualification Scenario

Updated on: Apr 18, 2025 | 12:32 PM

SRH Playoffs Qualification Scenario: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ 2025లో ఏడు మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు, పేలవమైన నికర రన్ రేట్ -1.217తో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నా.. మిగతా మ్యాచ్‌ల పరిస్థితి చూస్తే, ఈ ఏడాది కూడా హైదరాబాద్ ఫ్యాన్స్‌కు నిరాశేనని తెలుస్తోంది. అలా జరగకూడదంటే, మిగిలిన ఏడు మ్యాచ్‌లలో కనీసం ఐదు విజయాలు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అవసరం. ఆరు గెలిస్తే అర్హత సాధించినట్లే. అయితే, మిగిలిన ఏడు మ్యాచ్‌లలో గెలిస్తే బర్త్‌కి ఢోకా లేనట్లే. మూడు కంటే ఎక్కువ ఓటములు ఎదురైతే మాత్రం బ్యాగ్‌లు సర్దుకోవాల్సిందే. ఇకపై హైదరాబాద్ జట్టు కఠినమైన మ్యాచ్‌లను ఎదుర్కోనుంది. ఈ క్రమంలో కాటేరమ్మ కొడుకులమంటూ ముద్దుగా పిలిచుకుంటున్న హైదరాబాద్ డేంజరస్ ప్లేయర్లు అభిషేక్ వర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ ఫాంలోకి రావాలి. లేదంటే ఫ్యాన్స్‌కు నిరాశ.

  1. SRH తమ మిగిలిన 7 లీగ్ మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే, 18 పాయింట్లతో ఈ సీజన్‌ను ముగిస్తుంది. ప్లేఆఫ్ స్థానాన్ని దక్కించుకోవాలంటే ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచే అవకాశాలు ఉంటాయి.
  2. 6 మ్యాచ్‌లను గెలవడం ద్వారా సీజన్‌ను 16 పాయింట్లతో ముగిస్తుంది. దీంతో SRH అర్హత సాధించడానికి బలమైన అవకాశం లభిస్తుంది.
  3. 14 పాయింట్లు సాధిస్తే SRH విధి నెట్ రన్ రేట్ (NRR)తోపాటు ఇతర జట్లపై ఆధారపడి ఉంటుంది. టాప్ 4‌లోకి ప్రవేశించాలనే హైదరాబాద్ ఆశలు నిజం కావాలంటే, ప్రస్తుత నెట్ రన్ రేట్ -1.217 ను మెరుగుపరచడం కీలకం.
  4. SRH వారి మిగిలిన మ్యాచ్‌లలో ఆధిపత్యం చెలాయించి 12 పాయింట్లతో సీజన్ ముగించినా, నెట్ రన్ రేట్ బాగుంటే మాత్రం హైదరాబాద్ జట్టు సేఫ్ జోన్‌లో ఉన్నట్లే.
  5. ఇవి కూడా చదవండి
  6. ఇప్పటి నుంచి SRH మూడు మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఓడిపోతే ప్లేఆఫ్ పోటీ నుంచి తప్పుకుంటారు. అత్యంత పోటీతత్వం ఉన్న IPL 2025 సీజన్‌లో అర్హత సాధించడానికి 10 పాయింట్లు సరిపోవు.
  7. SRH జట్టు DC, KKR, MI జట్లకు సొంత మైదానంలో ఆతిథ్యం ఇవ్వనుంది. ఇవన్నీ గెలవాల్సిన మ్యాచ్‌లే. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో కావ్య మారన్ స్టాండ్స్‌లో ఉండటం వల్ల జట్టులో ధైర్యం, ప్రదర్శన పెరుగుతుందని అశించినా, లాభం లేకపోయింది.
  8. CSK, GT, RCB, LSG లతో జరిగే కఠినమైన మ్యాచ్‌లు SRH బ్యాటింగ్ లోతును పరీక్షిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటిలో రెండింటిలో గెలిస్తే ఈక్వేషన్ మారిపోతుంది.

SRH అర్హత సాధించాలంటే, పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్ వంటి స్టార్ ప్లేయర్లతోపాటు కీలకమైన భారత ఆటగాళ్ళు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో SRH వరుస విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్ రేసులో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. మరి ముందుముందు ఏం జరుగుతుందో చూడాలి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..