SRH: అబ్బ సాయిరామ్.! పెద్ద ప్లానింగే.. కావ్య పాప లిస్టులో ఈ ప్లేయర్స్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ దీని కోసం పక్కాగా ప్లాన్స్ సిద్దం చేసింది. మరి ఆ జట్టు వేలంలో ఎవరెవరిని కొనుగోలు చేస్తుందో.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

SRH: అబ్బ సాయిరామ్.! పెద్ద ప్లానింగే.. కావ్య పాప లిస్టులో ఈ ప్లేయర్స్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్
Srh 1

Updated on: Dec 15, 2025 | 12:07 PM

బ్యాటింగ్‌లో బీభత్సం సృష్టించే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం ప్రణాళికలు సిద్దం చేసింది. రూ. 25.5 కోట్లతో బరిలోకి దిగుతున్న SRH మినీ వేలంలో సుమారు 10 స్లాట్లను భర్తీ చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఒక ఇండియన్ స్పిన్నర్, బ్యాకప్ ఓపెనర్, టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌లు, ఏడో నంబర్ ఫినిషర్, మిడిల్ ఓవర్ ఇండియన్ పేసర్, పవర్‌ప్లే ఇండియన్ సీమర్‌లు, బ్యాకప్ పవర్‌ప్లే ఫారెన్ పేసర్ కోసం హైదరాబాద్ ఫ్రాంచైజీ వెతుకులాట మొదలుపెట్టింది. మరి సెట్ల వారీగా చూసుకుంటే.. ఈ ఆటగాళ్లను లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉంది.

మొదటి సెట్‌లో డేవిడ్ మిల్లర్, కామెరాన్ గ్రీన్.. ఈ ఇద్దరిపై హైదరాబాద్ యాజమాన్యం కన్నేసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ జట్టుకు ఓ ఫినిషర్ అవసరం.. కాబట్టి వీరిద్దరిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీ ఆసక్తి చూపిస్తుంది. అటు రెండో సెట్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ మిల్లర్‌కు ప్రత్యామ్నాయంగా లేదా మూడో స్పిన్నర్‌గా పరిగణనలోకి తీసుకోవచ్చు. ముఖ్యంగా నెంబర్ 4, 5, 6 స్థానాల్లో నితీష్, క్లాసెన్, అంకిత్ లాంటి కుడిచేతి వాటం బ్యాటర్‌లు ఉన్నందున, మిల్లర్ ఎడమచేతి వాటం బ్యాటర్ కాబట్టి కాంబినేషన్‌కు బలాన్నిస్తుంది. ఒకవేళ మిల్లర్ కాకపోతే లివింగ్‌స్టోన్ ఫినిషర్‌గా.. అటు స్పిన్నర్‌గా ఉపయోగపడతాడు. ఈ సెట్‌లో దీపక్ హుడాను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. నాలుగో సెట్‌లో క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్‌ల విషయంలో ఆకాష్ దీప్, గెరాల్డ్ కోయెట్జీ, జాకోబ్ డఫ్ఫీ బెస్ట్ ఆప్షన్స్.

ఆరో సెట్‌లో యశ్ ధుల్, ఆర్య దేశాయ్ లాంటి యువ కుర్రోళ్ళ కోసం SRH ప్రయత్నించవచ్చు. ఏడో సెట్‌లో ఇండియన్ ఆల్ రౌండర్‌ల కోటాలో అఖిబ్ నబీ, తనుష్ కోటియన్ కోసం హైదరాబాద్ ఫ్రాంచైజీ చూస్తుంది. ఎనిమిదో సెట్‌లో తుషార్ రహేజా, కార్తీక్ శర్మ.. తొమ్మిదో సెట్‌లో సుశాంత్ మిశ్రా, అశోక్ శర్మ, రాజ్ లింబాని.. పదో సెట్‌లో విగ్నేష్ పుతూర్.. 14వ సెట్‌లో ముస్తాఫిజుర్ రెహ్మాన్, లుంగి ఎంగిడి.. 16వ సెట్‌లో ఇండియన్ ఫినిషర్‌లు అంకిత్ కుమార్, సల్మాన్ నిజీర్ కోసం SRH ప్రయత్నించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చూడండి