SRH: ‘కట్టింగ్ ఎక్కువ.. క్రికెట్ తక్కువ’.. బంగారు బాతు అన్నారు.. ఇప్పుడు సన్‌రైజర్స్ బయటకు గెంటేస్తోంది..
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 4 మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. సఫారీ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఐడెన్ మార్క్‌రమ్ ఈ జట్టుకు సారధ్యం వహించిన విషయం విదితమే. అనుభవం లేని బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ కారణంగా..

ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 4 మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. సఫారీ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఐడెన్ మార్క్‌రమ్ ఈ జట్టుకు సారధ్యం వహించిన విషయం విదితమే. అనుభవం లేని బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ కారణంగా.. హైదరాబాద్ ఈ ఏడాది ఐపీఎల్‌లో చివరి స్థానంలో నిలిచిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో వచ్చే ఐపీఎల్ కోసం ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది సన్‌రైజర్స్ యాజమాన్యం. హెడ్ కోచ్‌గా ఉన్న బ్రియాన్ లారాను తప్పించి.. అతడి స్థానంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను ప్రధాన కోచ్‌గా నియమించాలని చూస్తోందట. ఆ మేరకు సెహ్వాగ్‌తో చర్చలు కూడా జరుపుతున్నట్లు వినికిడి.
మరోవైపు ఐపీఎల్ 2024 వేలం కోసం ఎదురుచూస్తోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన కొందరు ఆటగాళ్లను రిలీజ్ చేయాలని నిర్ణయించిందట. అందులో ముఖ్యంగా ఓ ఐదుగురు పేర్లు బాగా వినిపిస్తున్నాయ్. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్(రూ. 13.25 కోట్లు), బౌలర్ కార్తీక్ త్యాగీ, ఓపెనర్ మయాంక్ అగర్వాల్(రూ. 8.75 కోట్లు), ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(రూ. 8.75 కోట్లు), ఉమ్రాన్ మాలిక్(రూ. 4. కోట్లు) ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది.




