AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఆ ఇద్దరూ వన్డే వరల్డ్‌కప్‌ నుంచి ఔట్.! రోహిత్, ద్రవిడ్‌లతో కలిసి అగార్కర్ నయా స్కెచ్..

ప్రస్తుతం టెస్టులకే పరిమితమైన రవిచంద్రన్ అశ్విన్.. వన్డే ప్రపంచకప్‌ ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇంతకాలం వైట్-బాల్ క్రికెట్‌లో టీమిండియాకు రవీంద్ర జడేజా ప్రధాన స్పిన్నర్‌గా మాత్రమే కాదు.. ఆల్‌రౌండర్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. వరల్డ్‌కప్ రేసులో కూడా అతడే ముందు వరుసలో ఉండటం గమనార్హం. అంతేకాదు..

Team India: ఆ ఇద్దరూ వన్డే వరల్డ్‌కప్‌ నుంచి ఔట్.! రోహిత్, ద్రవిడ్‌లతో కలిసి అగార్కర్ నయా స్కెచ్..
Team India
Ravi Kiran
|

Updated on: Jul 28, 2023 | 4:43 PM

Share

ఒకరు ప్రపంచంలో బెస్ట్ ఆఫ్ స్పిన్నర్.. ఇంకొకరు విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఇప్పుడు ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు వన్డే ప్రపంచకప్ ఆడే ఛాన్సులు దాదాపుగా కనిపించట్లేదు. ఇక వారెవరో కాదు రవిచంద్రన్ అశ్విన్, సూర్యకుమార్ యాదవ్. రాబోయే ఆసియా కప్ టోర్నీ, అక్టోబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం జట్టు కూర్పుపై కసరత్తులు మొదలుపెట్టాడు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్. ప్రస్తుతం విండీస్‌లో ఉన్న అతడు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌లతో ఈ అంశంపై చర్చించనున్నాడు.

ప్రస్తుతం టెస్టులకే పరిమితమైన రవిచంద్రన్ అశ్విన్.. వన్డే ప్రపంచకప్‌ ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇంతకాలం వైట్-బాల్ క్రికెట్‌లో టీమిండియాకు రవీంద్ర జడేజా ప్రధాన స్పిన్నర్‌గా మాత్రమే కాదు.. ఆల్‌రౌండర్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. వరల్డ్‌కప్ రేసులో కూడా అతడే ముందు వరుసలో ఉండటం గమనార్హం. అంతేకాదు.. అతడితో పాటు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ లాంటివారు రాణిస్తుండటం.. మరికొంతమంది యువ స్పిన్నర్లకు టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశాలు ఇస్తుండటంతో.. అశ్విన్ ప్రపంచకప్ ఆడే అవకాశాలు తక్కువే.

మరోవైపు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు వన్డే ఫార్మాట్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. అతడు టీ20ల్లో రాణిస్తున్నప్పటికీ.. వన్డేలలో మాత్రం తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరుతున్నాడు. దీంతో యాజమాన్యం అతడిపై వేటు వేసి.. కేవలం టీ20లకే పరిమితం చేసే ఛాన్సులు లేకపోలేదు. అటు శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తుండగా.. వరల్డ్‌కప్‌నకు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి ఈ ఇద్దరు ప్లేయర్స్ డైరెక్ట్‌గా చోటు దక్కించుకుంటారు. కాబట్టి..! టీమిండియా పొమ్మనలేక.. పొగబెడుతూ.. అశ్విన్, సూర్యకుమార్ యాదవ్‌లను వన్డేలకు గుడ్‌బై చెప్పిస్తోంది.

Follow Us
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి