AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ‘ఇంకా జట్టులో రోహిత్, కోహ్లీ ఎందుకు.?’ యువ ప్లేయర్స్‌కు అవకాశాలు ఇవ్వరా..!

విండీస్ పర్యటనకు సంబంధించి జట్టు ఎంపికపై బీసీసీఐ సెలక్షన్ కమిటీని మరోసారి తప్పుపట్టాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ఈ సిరీస్ వల్ల టీమిండియాకు ఒరిగింది ఏంటని ప్రశ్నించారు. ఎలాంటి ప్రాధ్యానత లేని పర్యటనలో జట్టు ప్రధాన ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మంచి స్కోర్లు సాధించడం తప్పితే.. ఇంకేం కొత్తగా జరిగిందని దుయ్యబట్టాడు.

Team India: 'ఇంకా జట్టులో రోహిత్, కోహ్లీ ఎందుకు.?' యువ ప్లేయర్స్‌కు అవకాశాలు ఇవ్వరా..!
Kohli And Rohit
Ravi Kiran
|

Updated on: Jul 28, 2023 | 4:41 PM

Share

విండీస్ పర్యటనకు సంబంధించి జట్టు ఎంపికపై బీసీసీఐ సెలక్షన్ కమిటీని మరోసారి తప్పుపట్టాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ఈ సిరీస్ వల్ల టీమిండియాకు ఒరిగింది ఏంటని ప్రశ్నించారు. ఎలాంటి ప్రాధ్యానత లేని పర్యటనలో జట్టు ప్రధాన ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మంచి స్కోర్లు సాధించడం తప్పితే.. ఇంకేం కొత్తగా జరిగిందని దుయ్యబట్టాడు. ఇటీవల విండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి టెస్టులో భారత జట్టు అద్భుత విజయం సాధించినప్పటికీ.. రెండో మ్యాచ్‌లో వర్షం అంతరాయం కారణంగా.. టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(266) టీమిండియా తరపున చక్కటి ప్రదర్శన కనబరిచారు. ఈ నేపధ్యంలో గవాస్కర్ సెలక్షన్ కమిటీ తీరుపై మరోసారి మండిపడ్డాడు.

‘ఎప్పటిలానే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పరుగులు రాబట్టారు. ఇంతకన్నా టెస్టు సిరీస్‌లో ఒరిగిందేముంది. వాళ్ల ప్లేస్‌లో ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేవని అనుకోవాలా. ఈ ఇద్దరినీ పక్కనపెట్టి.. యువ ప్లేయర్స్‌ను ప్రయత్నించాలని అనుకోలేదా.? వాళ్లను ఆడిస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌ను ఎలా తట్టుకోగలరో తెలిసేదిగా’ అంటూ సునీల్ గవాస్కర్ బీసీసీఐ సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా అజిత్ అగార్కర్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఇక మీదటైనా.. జట్టు ఎంపిక విషయంలో మార్పులు ఉంటాయని భావిస్తున్నట్లు సన్నీ చెప్పుకొచ్చాడు. కాగా, గతంలోనూ టెస్టు జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకోకపోవడంపై సునీల్ గవాస్కర్ బీసీసీఐ సెలక్షన్ టీమ్ నిర్ణయాలను తప్పుబట్టిన విషయం విదితమే.

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!