Sunil Gavaskar Dance: టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్‌ని ఎన్నో పాత్రల్లో చూశాం. తొలుత క్రికెటర్, ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు, ఆపై వ్యాఖ్యాతగా ఇలా ఎన్నో పాత్రల్లో కనిపిచారు. తాజాగా ఓ డ్యాన్సర్‌గా కనిపించిన ఆయన, టీమిండియా క్రికెటర్ల ముందు అదిరిపోయే స్టెప్పులతో లేటు వయసులోనూ తన ఘాటు చూపించారు. వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సునీల్ గవాస్కర్ వేదికపై డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
వాంఖడే స్టేడియం వేడుకల్లో సునీల్ గవాస్కర్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను ముంబై క్రికెట్ అసోసియేషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో సంగీత దర్శకుడు విశాల్, శేఖర్ పాటకు గవాస్కర్ డ్యాన్స్ చేయడాన్ని చూడొచ్చు.
वानखेडेवर क्रिकेटची 𝘿𝙚𝙚𝙬𝙖𝙣𝙜𝙞 𝘿𝙚𝙚𝙬𝙖𝙣𝙜𝙞 😍
P.S. – Don’t miss Sunny G’s apratim dance performance! 👌#Wankhede50 | #MCA | #Mumbai | #Cricket pic.twitter.com/t5DllZ9uEC
— Mumbai Cricket Association (MCA) (@MumbaiCricAssoc) January 19, 2025
శేఖర్ ఓం శాంతి ఓం హాధు పాడుతున్న సమయంలో వేదిక ముందుకు వచ్చిన సునీల్ గవాస్కర్ కొద్ది క్షణాలు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
సునీల్ గవాస్కర్ డ్యాన్స్ చేసిన ఈ వేదికపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అజింక్యా రహానే కూడా కనిపించారు. చప్పట్లతో గవాస్కర్‌ను ఉత్సాహపరిచారు.
వాంఖడే స్టేడియం 50వ వార్షిక ఈవెంట్‌లో స్టార్ ఆటగాళ్లు ముంబైకి ప్రాతినిధ్యం వహించారు. వారిలో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..