బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించడం ద్వారా తనకు కావాల్సిన ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నాడని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్(Sunil Gavaskar) అన్నాడు. కోహ్లీ నుంచి బెంగళూరు(RCB) జట్టు కూడా ఇదే ఆశిస్తుందని అన్నాడు. ఇప్పటికే 5 విజయాలు, 5 ఓటములతో కొనసాగుతున్న ఆ జట్టుకు కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడం ఊరటనిచ్చే విషయమని చెప్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు 0, 0, 9 పరుగులతో విఫలమైన కోహ్లీ (58; 53 బంతుల్లో 6×4, 1×6) గుజరాత్‌పై మెరిశాడు. “కోహ్లీతో పాటు బెంగళూరు జట్టుకు కావాల్సింది ఇదే. ఒక్కసారి అతడు గాడిలో పడి అర్ధశతకం సాధిస్తే మిగతా మ్యాచ్‌ల్లోనూ ఇలాగే రాణించడానికి దోహదపడుతుంది. ఇలాంటి కీలక బ్యాట్స్‌మన్ పరుగులు చేయడం చాలా మంచి విషయం. ఈ మ్యాచ్‌లో కోహ్లీ క్రీజులో ఉండగా తన కాలి కదలికలు కూడా బాగున్నాయి.” అని సునీల్ గావస్కర్ అన్నాడు.
యువ బ్యాటర్ రజత్ పాటిదార్ గురించి మాట్లాడిన సన్నీ.. మూడో స్థానంలో ఈ యువకుడు సరిగ్గా సరిపోయాడని చెప్పాడు. డుప్లెసిస్ ఔటయ్యాక టాప్ క్లాస్ బ్యాటింగ్ చేశాడని మెచ్చుకున్నాడు. అతడు జట్టు నమ్మకాన్ని కాపాడినట్టు చెప్పాడు. బెంగళూరుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. గుజరాత్ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
Read Also.. IPL 2022: ఔటివ్వలేదని అంపైర్‌పై అలిగిన చాహల్.. సూర్యకుమార్ ఎలా బుజ్జగించాడో మీరే చూడండి..