IPL 2025: ఆటగాళ్లకు బిగ్ షాక్! IPLలో కఠినమైన రూల్స్..

IPL 2025 సీజన్‌కు ముందుగా, BCCI ఆటగాళ్ల కోసం కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టింది. ఆటగాళ్లు కేవలం జట్టు బస్సులోనే ప్రయాణించాలనే నిబంధనతో పాటు, డ్రెస్సింగ్ రూమ్‌లో కుటుంబ సభ్యుల ప్రవేశాన్ని నిషేధించింది. మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ వేడుకల్లో ఫార్మల్ డ్రెస్సింగ్ తప్పనిసరి చేయడంతోపాటు, LED బోర్డులపై బంతిని కొట్టకుండా బ్యాటర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ఆటలో మరింత క్రమశిక్షణ తీసుకురావడమే కాకుండా, ఆటగాళ్ల ప్రవర్తనకు స్పష్టమైన నియమాలను అందిస్తాయని BCCI పేర్కొంది.

IPL 2025: ఆటగాళ్లకు బిగ్ షాక్! IPLలో కఠినమైన రూల్స్..
Ipl 2025 New Rules

Updated on: Mar 06, 2025 | 12:20 PM

2025 IPL సీజన్‌కు ముందుగా, BCCI ఆటగాళ్ల కోసం కఠినమైన SOPలను అమలు చేసింది. భారత జట్టుపై ఇటీవల అమలు చేసిన కొన్ని నియమాలను 10 IPL ఫ్రాంచైజీలకు విస్తరించి, ఆటగాళ్లు కేవలం జట్టు బస్సులోనే ప్రయాణించాలనే నిబంధనను తీసుకొచ్చింది. అంతేకాకుండా, మ్యాచ్ లేని రోజుల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు డ్రెస్సింగ్ రూమ్‌లలోకి ప్రవేశించకూడదనే నిబంధనను కూడా అమలు చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలను ప్రధానంగా ఆట క్రమశిక్షణ పెంచడంలో భాగంగా తీసుకున్నట్లు BCCI స్పష్టం చేసింది.

డ్రెస్సింగ్ రూమ్ నియమాలు.. కుటుంబ సభ్యులకు నో ఎంట్రీ!

IPL ప్రాక్టీస్ రోజుల్లో కూడా ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు డ్రెస్సింగ్ రూమ్‌లోకి ప్రవేశించడానికి అనుమతించరని BCCI తెలిపింది. మ్యాచ్ ప్రాక్టీస్ సమయంలో మాత్రమే గుర్తింపు పొందిన సిబ్బందిని డ్రెస్సింగ్ రూమ్‌లోకి అనుమతిస్తారు. ఆటగాళ్ల స్నేహితులు, కుటుంబ సభ్యులు వేరే వాహనాల్లో ప్రయాణించాల్సి ఉంటుందని, ఆట మైదానం వెలుపల ఉన్న అతిథి ప్రాంతం నుంచి మ్యాచ్‌ను వీక్షించవచ్చని పేర్కొంది.

ఆటగాళ్లకు కొత్త ఆచరణ నియమాలు

IPL లో పాల్గొనే ఆటగాళ్లు ప్రాక్టీస్ కోసం తప్పనిసరిగా జట్టు బస్సులోనే ప్రయాణించాలి. ముందుగా కొన్ని ఆటగాళ్లు వ్యక్తిగత వాహనాల్లో ప్రాక్టీస్ సెషన్లకు హాజరయ్యేవారు. అయితే ఇప్పుడు BCCI కొత్త మార్గదర్శకాలను అమలు చేసి, ప్రతి ఆటగాడు ప్రాక్టీస్ కోసం జట్టు బస్సును ఉపయోగించాల్సిందేనని స్పష్టం చేసింది.

ప్రజెంటేషన్, డ్రెస్సింగ్ కోడ్‌పై కఠినమైన నిబంధనలు

IPL మ్యాచ్‌ల అనంతరం జరగే ప్రెజెంటేషన్ వేడుకల్లో ఆటగాళ్లు స్లీవ్‌లెస్ జెర్సీలు ధరించకూడదు. ఫార్మల్ డ్రెస్సింగ్‌ను పాటించకుంటే మొదటిసారి హెచ్చరిక ఇచ్చి, రెండవసారి నుంచి ఆర్థిక జరిమానా విధించనున్నారు. అలాగే, ఆటగాళ్లు అక్రిడిటేషన్ కార్డును మరిచిపోయినా జరిమానా విధించనున్నారు.

LED బోర్డుల హాని – బ్యాటర్లకు హెచ్చరిక

BCCI ప్రకటన ప్రకారం, బ్యాటర్లు బౌండరీ రోప్స్ వెలుపల ఉన్న LED బోర్డులపై బంతిని కొట్టకూడదని హెచ్చరించింది. స్పాన్సర్ షిప్ బృందాలు ఈ బోర్డుల రక్షణ కోసం ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని సూచించింది.

ఈ కఠినమైన నియమాలు ఆటలో మరింత క్రమశిక్షణను తీసుకురావడమే కాకుండా, ఆటగాళ్ల ప్రవర్తనకు కూడా మార్గదర్శకంగా ఉంటాయని BCCI భావిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..