
ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు మంచి రోజులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. కొత్త సీజన్లో పేలవమైన ప్రారంభం కారణంగా, ఢిల్లీ క్యాపిటల్స్, వార్నర్ నిరంతరం ఒత్తిడిలో ఉన్నారు. వీటన్నింటి మధ్యలో వార్నర్‌తో పాటు కొంతమంది జట్టు ఆటగాళ్ల బ్యాట్లు, ప్యాడ్లు, గ్లౌజులు వంటి ముఖ్యమైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇప్పుడు ఢిల్లీకి 24 గంటల్లోనే డబుల్ న్యూస్ వచ్చింది. ఈ సీజన్లో మొదటి విజయం సాధించిన తర్వాత దొంగిలించబడిన వస్తువులు కూడా దొరికాయి.
ఏప్రిల్ 20 గురువారం నాడు ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఐదు వరుస పరాజయాల తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విధంగా ఐపీఎల్ 2023లో వార్నర్ జట్టు ఖాతా తెరిచింది. ఈ విజయం ఢిల్లీ సీజన్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ విజయం తర్వాత వార్నర్ శుక్రవారం మరో శుభవార్త పంచుకున్నాడు.
ఢిల్లీ కెప్టెన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక కథనాన్ని పంచుకున్నాడు. అందులో అనేక బ్యాట్లు కనిపించాయి. పోలీసులు దొంగను పట్టుకున్నారని, అయితే కొన్ని వస్తువులు ఇంకా కనిపించలేదని వార్నర్ రాసుకొచ్చాడు. మూడు రోజుల క్రితం, బెంగళూరు నుంచి తిరిగి వస్తుండగా పలువురు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల వస్తువులు అపహరణ గురైన సంగతి తెలిసిందే.
ఇందులో లక్షకు పైగా విలువైన 17 బ్యాట్స్ గల్లంతయ్యాయి. వార్నర్‌తో పాటు, మిచెల్ మార్ష్, యష్ ధుల్లకు చెందిన చాలా వస్తువులు కూడా అదృశ్యమయ్యాయి. యువ బ్యాట్స్‌మెన్ యష్ ధుల్ గరిష్టంగా 5 బ్యాట్లను కోల్పోయాయి. ఇవి కాకుండా షూలు, ప్యాడ్లు, గ్లౌజులు, సన్ గ్లాసెస్ వంటి ఇతర వస్తువులు కూడా చోరీకి గురయ్యాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..