బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగిన తొలి యాషెస్ సిరీస్ టెస్టులో ఇంగ్లండ్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ తక్కువ పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాలిస్మాన్ బెన్ స్టోక్స్ జట్టులోకి తిరిగి వచ్చినా ప్రభావం చూపలేదు. మొదటి టెస్ట్‌లో ఇంగ్లండ్ తమ వెటరన్ పేసర్లు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ఇద్దరికి ప్లేయింగ్ XIలో చోటు కల్పించలేదు. దీనిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పాడు. ఇంగ్లండ్ ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో ఆలీ రాబిన్సన్, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్‌తో ఆడింది. అయితే జట్టులో జాక్ లీచ్ ఒంటరి స్పిన్నర్. లీచ్ తొలి ఇన్నింగ్స్‌లో అంతగా ప్రభావం చూపలేకపోయాడు. “వారు వారిని (బ్రాడ్, అండర్సన్) అడిలైడ్‌కు సిద్ధం చేయకుంటే వారిని ఎందుకు ఎంపిక చేయలేదో నమ్మలేపోతున్నా ” అని పాంటింగ్‌ని క్రికెట్.కామ్‌కు చెప్పాడు.
” ఆస్ట్రేలియాలో క్రిస్ వోక్స్ కంటే స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ మెరుగైన బౌలర్లు. ఆ ఇద్దరిలో ఒకరు ఆడాల్సి ఉంటుంది. అడిలైడ్‌లో బ్రాడ్ లేదా అండర్సన్‌లలో ఒకరిని మాత్రమే ఆడే అవకాశం ఉంది. ” అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అన్నాడు. అండర్సన్, బ్రాడ్ మధ్య 1,156 టెస్ట్ వికెట్లు తీశారు. తద్వారా వారు ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన బౌలింగ్ జోడిగా నిలిచారు. ఆస్ట్రేలియా తరఫున ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్‌లు అత్యధిక స్కోరర్లుగా నిలిచారు. హెడ్ కేవలం 148 బంతుల్లోనే 152 పరుగులు చేశాడు. వార్నర్ 94 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసింది. జో రూట్, డేవిడ్ మలన్ 3వ రోజున ఇంగ్లండ్ పోరాటానికి నాయకత్వం వహించారు. ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొన్నారు. స్పిన్నర్ నాథన్ లియాన్ ఇంగ్లీష్ ఆటగాళ్లను దెబ్బు కొట్టాడు. దీంతో ఇంగ్లండ్ 297 పరుగులకు ఆలౌట్ అయింది.
Read Also.. Yuvraj Singh: సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్.. అతడి రికార్డులు ఎవరికి సాధ్యం కావు..!