క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్.. అప్పట్లో టీమిండియాకు ముప్పుతిప్పలు..!

Upul Tharanga Retires: శ్రీలంక స్టార్ ఓపెనర్ ఉపుల్ తరంగ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2005లో తన ఇంటర్నేషనల్ కెరీర్ మొదలుపెట్టిన తరంగ..

  • Ravi Kiran
  • Publish Date - 12:45 pm, Wed, 24 February 21
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్.. అప్పట్లో టీమిండియాకు ముప్పుతిప్పలు..!

Upul Tharanga Retires: శ్రీలంక స్టార్ ఓపెనర్ ఉపుల్ తరంగ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2005లో తన ఇంటర్నేషనల్ కెరీర్ మొదలుపెట్టిన తరంగ.. 2019 మార్చిలో శ్రీలంక తరపున చివరి మ్యాచ్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న తరంగ.. వన్డేలలో 15 సెంచరీలతో 6951 పరుగులు.. టెస్టుల్లో 1754 పరుగులు, టీ20లలో 407 పరుగులు నమోదు చేశాడు.

“ప్రతి మంచి విషయానికి ముగింపు ఉంటుంది. నా 15 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికే సమయం వచ్చిందని భావిస్తున్నాను.” అని తరంగ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. తన రిటైర్మెంట్ లెటర్‌లో, క్రికెట్ తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఇచ్చిందంటూ.. తరంగ అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

నాడు తరంగ ఇన్నింగ్స్‌తో టీమిండియాకు ముప్పుతిప్పలు…

తరంగ వన్డే క్రికెట్‌లో అద్భుతమైన ఓపెనర్. ఓపెనర్‌గా వన్డే క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 174 పరుగులు. ఇది 2013లో ట్రినిటీ సిరీస్‌లో భారత్‌తో ఆడిన మ్యాచ్‌ ద్వారా వచ్చినవి. అంతేకాకుండా ఆ మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో శ్రీలంక మొత్తం 349 పరుగులు చేయగా.. ధోనిసేన కేవలం 187 పరుగులు మాత్రమే చేసింది. ఈ సిరీస్‌ను శ్రీలంక 4-2తో కైవసం చేసుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?

ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!

రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!