IPL 2021 : రాజస్థాన్ రాయల్స్​ జట్టులో మార్పులు.. చేర్పులు.. టీమ్ డైరెక్టర్​గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర

| Edited By: Pardhasaradhi Peri

Jan 25, 2021 | 7:20 AM

జట్టులో మార్పులు... చేర్పులు చేస్తోంది  రాజస్థాన్ రాయల్స్​ మొదలు పెట్టింది చేస్తోంది. ఇటీవల కెప్టెన్​గా స్టీవ్​స్మిత్​ను తొలగించి యువ క్రికెటర్ సంజూ శాంసన్​కు ఆ బాధ్యతలు అప్పగించింది.

IPL 2021 : రాజస్థాన్ రాయల్స్​ జట్టులో మార్పులు.. చేర్పులు.. టీమ్ డైరెక్టర్​గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర
Follow us on

Rajasthan Royals : జట్టులో మార్పులు… చేర్పులు చేస్తోంది  రాజస్థాన్ రాయల్స్​ మొదలు పెట్టింది చేస్తోంది. ఇటీవల కెప్టెన్​గా స్టీవ్​స్మిత్​ను తొలగించి యువ క్రికెటర్ సంజూ శాంసన్​కు ఆ బాధ్యతలు అప్పగించింది. తాజాగా మారో భారీ మార్పుకు శ్రీకారం చుట్టింది.

శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కరకు కీలక పదవి కట్టబెట్టింది రాజస్థాన్​ రాయల్స్ యాజమాన్యం​. వచ్చే సీజన్​ కోసం అతడిని జట్టుకు డైరెక్టర్​గా నియమించింది. ప్రస్తుతం మెరీల్​బోన్​ క్రికెట్​ క్లబ్ ​(ఎంసీసీ) అధ్యక్షుడిగా ఉన్నాడు.

బాధ్యతల్లో భాగంగా రాజస్థాన్​ రాయల్స్​ కోచింగ్ విధానం, వేలం ప్రణాళికలతో పాటు జట్టు వ్యూహాలను రచించనున్నాడు. ఆటగాళ్ల ప్రతిభను గుర్తించి మెరుగుపరచడం సహా నాగ్‌పూర్‌లోని రాజస్తాన్​ రాయల్స్ అకాడమీని అభివృద్ధి చేసే బాధ్యతను అతడి అప్పగించింది.

ప్రపంచంలోనే ప్రముఖ క్రికెట్​ పోటీలో ఫ్రాంఛైజీ వ్యూహాల పర్యవేక్షణ, జట్టు విజయానికి అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనలో పాలుపంచుకునే అవకాశమే నేను బాధ్యతలు స్వీకరించడానికి ప్రేర అని సంగక్కర అన్నాడు.

శ్రీలంక తరఫున 28వేల పైగా పరుగులు చేశాడు సంగక్కర. టెస్టుల్లో గత 46ఏళ్లలో అతడిదే అత్యుత్తమ బ్యాటింగ్ సగటు. డైరెక్టర్​గా సంగా ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.

ఇవి కూడా చదవండి :

ఏపీలో లోకల్‌ ఎలక్షన్‌ పంచాయితీ.. నేడు సుప్రీంకోర్టులో కీలక వాదనలు..అందరిలో ఇదే ఉత్కంఠ

ఆల్‌టైమ్‌ గరిష్ట రికార్డును క్రాస్ చేసిన పెట్రోల్ ధరలు.. ముంబై తర్వాత స్థానానికి చేరిన హైదరాబాద్..