గబ్బర్ చేసిన పనికి పడవ నడిపిన వ్యక్తిపై జిల్లా అధికారుల చర్యలు.. ఆంక్షలు అతిక్రమించాడంటూ వార్నింగ్ నోటీస్
భారత క్రికెటర్ గబ్బర్ శిఖర్ ధావన్ చేసిన పనికి ఓ పడవ నడిపే జాలరిపై వారణాసి జిల్లా కలెక్టర్ కౌశల్ రాజ్ శర్మ చర్యలు తీసుకోనున్నారు. అయితే ధావన్ చేసిందల్లా కొన్ని పక్షులకు ఆహారం
Dhawan Bird Flu Controversy : భారత క్రికెటర్ గబ్బర్ శిఖర్ ధావన్ చేసిన పనికి ఓ పడవ నడిపే జాలరిపై వారణాసి జిల్లా కలెక్టర్ కౌశల్ రాజ్ శర్మ చర్యలు తీసుకోనున్నారు. అయితే ధావన్ చేసిందల్లా కొన్ని పక్షులకు ఆహారం అందించడమే. ధావన్ఇటీవల వారణాసి పర్యటనకు వెళ్లి.. కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అందులో పక్షులకు ఆహారం తినిపిస్తూ కనిపించిన గబ్బర్.. ఆ పని ఎంతో సంతోషాన్నిచ్చిందని క్యాప్షన్ పెట్టాడు. అయితే ఇప్పుడు అదే ఫొటో వారణాసిలో అతడు పయనించిన పడవ నడిపే వ్యక్తిపై చర్యలు తీసుకోవడానికి కారణంగా మారింది.
View this post on Instagram
కొద్ది రోజులుగా పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పక్షులకు ఎలాంటి ఆహారం అందించరాదని వారణాసిలో ఆదేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ధావన్ చర్య పడవ నడిపే వ్యక్తిపై శిక్షగా మారింది. పడవలు నడిపేవారికి మేము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం… పర్యాటకులను పక్షులకు ఆహారం అందించకుండా చూడమని చెప్పామని కలెక్టర్ తెలిపారు. ఉత్తర్వులు పాటించానివారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. వారి లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో తెలిపాని అన్నారు. సాధారణంగా పర్యాటకులను ఇలాంటి విషయాలపై అవగాహన ఉండదు కాబట్టి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.