ఐసీసీ ప్రపంచకప్ 2019: ఈసారి వరుణుడి స్థానంలో తేనెటీగలు!
ఐసీసీ ప్రపంచకప్ 2019 మ్యాచ్‌లకు ఇన్నాళ్లూ వరుణుడు ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని మ్యాచ్‌లు టాస్ పడకుండానే రద్దు కాగా, మరికొన్నింటిని కుదించి కొనసాగించారు. శుక్రవారం దక్షిణాఫ్రికా-శ్రీలంక మ్యాచ్‌కు కూడా కాసేపు ఆటంకం ఎదురైంది. అయితే ఈసారి వరుణుడు కాకుండా… తేనెటీగల వల్ల అంతరాయం కలిగింది. శ్రీలంక ఇన్నింగ్స్ 48 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రిస్ మోరిస్ బౌలింగ్ చేస్తుండగా.. ఐదో బంతి వేశాక ఒక్కసారిగా మైదానంలోకి తేనెటీగలు గుంపులుగా వచ్చాయి. […]

ఐసీసీ ప్రపంచకప్ 2019 మ్యాచ్‌లకు ఇన్నాళ్లూ వరుణుడు ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని మ్యాచ్‌లు టాస్ పడకుండానే రద్దు కాగా, మరికొన్నింటిని కుదించి కొనసాగించారు. శుక్రవారం దక్షిణాఫ్రికా-శ్రీలంక మ్యాచ్‌కు కూడా కాసేపు ఆటంకం ఎదురైంది. అయితే ఈసారి వరుణుడు కాకుండా… తేనెటీగల వల్ల అంతరాయం కలిగింది. శ్రీలంక ఇన్నింగ్స్ 48 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రిస్ మోరిస్ బౌలింగ్ చేస్తుండగా.. ఐదో బంతి వేశాక ఒక్కసారిగా మైదానంలోకి తేనెటీగలు గుంపులుగా వచ్చాయి. దీంతో ఆటగాళ్లతో సహా.. అంపైర్లు కూడా వాటి నుంచి తప్పించుకోవడానికి కింద పడుకున్నారు. కాసేటికి అంతా సర్దుకోవడంతో వెంటనే మ్యాచ్ కొనసాగింది.
ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్లు మైదానంలో తలపడుతుండగా ఇలా తేనెటీగలు మ్యాచ్‌కు అంతరాయం కలిగిచడం ఇది రెండోసారి. 2017లో ఇరు జట్లు మధ్య వన్డే మ్యాచ్ సందర్భంగా తేనెటీగలు మైదానంలో వచ్చి ఆటకు చాలాసేపు అంతరాయం కలిగించాయి. విచిత్రమేమిటంటే అప్పుడు కూడా శ్రీలంకనే బ్యాటింగ్ చేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ రెండు ఫొటోలను కలిపి క్రికెట్ వరల్డ్‌కప్ తాజాగా ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
BEEEEWARE ? https://t.co/CuyshvsXJM
— Cricket World Cup (@cricketworldcup) June 28, 2019