IND vs SL 1st T20: లంక టార్గెట్ 165 పరుగులు.. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన సూర్యకుమార్.. రాణించిన ధావన్

| Edited By: Rajeev Rayala

Jul 25, 2021 | 10:03 PM

IND vs SL 1st T20 : భారత్, శ్రీలంక మధ్య మూడు టీ 20 మ్యాచ్‌ సిరీస్‌లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మొదటి టీ 20 మ్యాచ్ జరగుతుంది.

IND vs SL 1st T20: లంక టార్గెట్ 165 పరుగులు.. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన సూర్యకుమార్.. రాణించిన ధావన్
Ind Vs Sl 1st T20
Follow us on

IND vs SL 1st T20 : భారత్, శ్రీలంక మధ్య మూడు టీ 20 మ్యాచ్‌ సిరీస్‌లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మొదటి టీ 20 మ్యాచ్ జరగుతుంది. మొదటగా టాస్ గెలిచి శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. దీంతో శ్రీలంకకు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్‌ గా మొదటిసారి బ్యాటింగ్‌కి దిగిన పృథ్వీ షా మొదటి బంతికే ఔటయ్యాడు. దీంతో బరువు మొత్తం కెప్టెన్ శిఖర్ ధావన్‌పై పడింది. దీంతో సంజు శాంసన్, శిఖర్ దావన్ నిలకడగా ఆడారు. అనంతరం హసరంగ బౌలింగ్‌లో సంజు శాంసన్ 27 పరుగులు ఔటయ్యాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యదావ్ దాటిగా ఆడటం ప్రారంభించాడు. ఇతడికి ధావన్ తోడవడంతో స్కోరు బోర్డు పరుగెత్తింతి. ఈ క్రమంలో భారీ షాట్‌కి యత్నించిన శిఖర్ ధావన్ 46 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం యదవ్ హాప్ సెంచరీ పూర్తి చేశాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లులతో 50 పరుగులు చేసి షాట్‌కి ప్రయత్నించి 15 ఓవర్లో 4 వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య 10 పరుగులు చేసి ఔట్ కాగా చివరలో ఇషాన్ కిషన్ చివరలో మెరిపించాడు. దీంతో భారత్ 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. శ్రీలకం లక్ష్యం 165 పరుగులుగా నిర్ణయించింది.