SRH vs PBKS Highlights, IPL 2025: రికార్డ్ ఛేజింగ్.. 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘన విజయం..
Sunrisers Hyderabad vs Punjab Kings Highlights: ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక పరుగుల లక్ష్యఛేదనను సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి చేసింది. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆ జట్టు 246 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలోనే సాధించింది.

Sunrisers Hyderabad vs Punjab Kings Highlights: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయింది. ఇన్నాళ్లు అభిమానులకు చిరాకు తెప్పించిన ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్.. పంజాబ్‌తో కీలక మ్యాచ్‌లో చెలరేగిపోయారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ రికార్డు ఐపీఎల్ సెంచరీతో, సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. మొత్తంగా ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఉత్కంఠ మ్యాచ్‌లలో ఒకటి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగినట్లైంది. ఈ మ్యాచ్ టోర్నమెంట్ చరిత్రలో అత్యంత తుఫాన్ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచేలా చేసింది. దీంతో హైదరాబాద్ జట్టు పంజాబ్ ఇచ్చిన టార్గెట్‌ను 9 బంతుల ముందుగానే ఛేదించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, సిమర్జిత్ సింగ్, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, త్రా మహ్మద్ షమీ.
పంజాబ్ కింగ్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో యాన్సన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్.
రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్స్:
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: సూర్యాంశ్ షెడ్గే, యష్ ఠాకూర్, ప్రవీణ్ దూబే, వైషాక్ విజయ్‌కుమార్, హర్‌ప్రీత్ బ్రార్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్: అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్, జయదేవ్ ఉనద్కత్.
LIVE Cricket Score & Updates
-
8 వికెట్ల తేడాతో విజయం
ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక పరుగుల లక్ష్యఛేదనను సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి చేసింది. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై హైదరాబాద్ జట్టు 246 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18 ఓవర్లలోనే సాధించింది.
-
అభిషేక్ శర్మ ఔట్
17వ ఓవర్లో హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ ఓవర్ రెండో బంతికి అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. అభిషేక్ 55 బంతుల్లో 141 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి.
-
-
200 పరుగులు..
సన్ రైజర్స్ హైదరాబాద్ 15వ ఓవర్లో 200 పరుగులు పూర్తి చేసుకుంది. చాహల్ పై అభిషేక్ శర్మ సిక్స్ కొట్టి జట్టును 200 పరుగులు దాటించాడు.
-
40 బంతుల్లోనే సెంచరీ
14 ఓవర్లు ముగిసేసరికి SRH ఒక వికెట్ నష్టానికి 186 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ,హెన్రిచ్ క్లాసెన్ క్రీజులో ఉన్నారు. అభిషేక్ తన కెరీర్‌లో తొలి సెంచరీని 40 బంతుల్లోనే సాధించాడు.
-
హెడ్ ఔట్
12.2 ఓవర్లలో SRH 1 వికెట్ నష్టానికి 171 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు. యుజ్వేంద్ర చాహల్‌ను ట్రావిస్ హెడ్‌ను పెవిలియన్ చేర్చాడు. హెడ్ 66 పరుగులు చేశాడు.
-
-
8వ ఓవర్‌లోనే 100 దాటిన SRH
8వ ఓవర్లో హైదరాబాద్ 100 పరుగులు పూర్తి చేసుకుంది. యుజ్వేంద్ర చాహల్ పై అభిషేక్ శర్మ సిక్స్ కొట్టి జట్టు 100 పరుగులు దాటేలా చేశాడు.
-
పవర్ ప్లేలో ఒక్క వికెట్ కోల్పోని హైదరాబాద్
246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పవర్‌ప్లేలో వేగంగా ఆరంభించింది. తొలి 6 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది.
-
50 పరుగులు దాటిన హైదరాబాద్
సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగో ఓవర్లో 50 పరుగులు పూర్తి చేసుకుంది. ఆ ఓవర్ లోని మూడో బంతికి అభిషేక్ శర్మ సిక్స్ కొట్టి జట్టును 50 దాటించారు.
-
వేగం పెంచిన హెడ్
SRH ఒక ఓవర్ ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ క్రీజులో ఉన్నారు.
-
హైదరాబాద్ టార్గెట్ 246
ఐపీఎల్ 27వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 246 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.
-
6 వికెట్లు కోల్పోయిన పంజాబ్
17.3 ఓవర్లలో పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్, గ్లెన్ మాక్స్వెల్ క్రీజులో ఉన్నారు. శశాంక్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
-
4 వికెట్లు డౌన్
14.1 ఓవర్లలో పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్, గ్లెన్ మాక్స్వెల్ క్రీజులో ఉన్నారు.
-
రెండో వికెట్ డౌన్
11 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 2 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్, నేహా వధేరా క్రీజులో ఉన్నారు.
-
తొలి వికెట్ డౌన్
6 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ ఒక వికెట్ కోల్పోయి 89 పరుగులు చేసింది. జట్టు తరపున ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ మైదానంలో ఉన్నారు. ప్రియాంష్ ఆర్యకు హర్షల్ పటేల్ క్యాచ్ ఇవ్వగా, ప్రియాంష్ 36 పరుగులు చేశాడు.
-
కమ్మిన్స్‌ను బాదేసిన పంజాబ్ ఓపెనర్లు
రెండు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది.
-
హ్యాట్రిక్ బౌండరీలు
పంజాబ్ ఒక ఓవర్ ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ క్రీజులో ఉన్నారు. షమీ వేసిన తొలి ఓవర్‌లోనే సిమ్రాన్ హ్యాట్రిక్ బౌండరీలతో విరుచుకపడ్డాడు.
-
రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్స్
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: సూర్యాంశ్ షెడ్గే, యష్ ఠాకూర్, ప్రవీణ్ దూబే, వైషాక్ విజయ్‌కుమార్, హర్‌ప్రీత్ బ్రార్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్: అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్, జయదేవ్ ఉనద్కత్.
-
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI:
ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్.
-
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI:
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, ఎషాన్ మలింగ.
-
టాస్ ఓడిన హైదరాబాద్..
ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ ఓడిపోయింది. దీంతో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
-
హైదరాబాద్ జట్టుదే ఆధిపత్యం..
ఇప్పటివరకు హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ మధ్య 16 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో 16 హైదరాబాద్, 7 పంజాబ్ గెలిచాయి. అదే సమయంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రెండు జట్లు 9 సార్లు తలపడ్డాయి. వీటిలో హైదరాబాద్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పంజాబ్ కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది.
-
పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ పోరు
ఈ రోజు రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) పంజాబ్ కింగ్స్ (PBKS)తో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మొదలైంది.
Published On - Apr 12,2025 6:41 PM