SRH vs MI, IPL 2024: ఉప్పల్‌లో ఊచకోత.. చెలరేగిన హైదరాబాదీ ప్లేయర్లు.. రికార్డుల బద్దలు

ఐపీఎల్ 2024 సీజన్ ఎనిమిదో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన హైదరాబాదీ ప్లేయర్లు ముంబౌ బౌలర్లను ఊచకోత కోశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి 10 ఓవర్లలో 148 పరుగులు చేసింది

SRH vs MI, IPL 2024: ఉప్పల్‌లో  ఊచకోత.. చెలరేగిన హైదరాబాదీ ప్లేయర్లు.. రికార్డుల బద్దలు
Abhishek Sharma, Travis Head
Follow us

|

Updated on: Mar 27, 2024 | 9:13 PM

ఐపీఎల్ 2024 సీజన్ ఎనిమిదో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన హైదరాబాదీ ప్లేయర్లు ముంబౌ బౌలర్లను ఊచకోత కోశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి 10 ఓవర్లలో 148 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే తొలి 10 ఓవర్లలో ఇప్పటివరకు ఇదే భారీ స్కోరు. ఇందులో మొత్తం 14 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. వన్ డౌన్ లో వచ్చిన అభిషేక్ శర్మ కేవలం 19 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. అంతకు ముందు వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 పరుగుల వద్ద ఔటయ్యాడు. మయాంక్ అగర్వాల్ 13 బంతుల్లో 11 పరుగులు చేసి ఔట్ కాగా, ఐడెన్ మర్కరమ్ 23 బంతుల్లో 34 పరుగులతో, హెన్రిచ్ క్లాసెన్ 15 బంతుల్లో 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. 16 ఓవర్లు ముగిసే సరికి ఎస్ ఆర్ హెచ్ 3 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.

భారీ స్కోరు దిశగా సన్ రైజర్స్ హైదరాబాద్..

వరల్డ్ కప్ హీరో విధ్వంసం..

అభిషేక్ శర్మ ఊచకోత..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..