WTC 2025 Final: 27 ఏళ్ల కలకు 69 అడుగుల దూరం.. హిస్టరీ మార్చేందుకు సిద్ధమైన బ్యాడ్ లక్ టీం..

South Africa vs Australia, WTC 2025 Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో, మూడవ రోజు ముగిసే సమయానికి జట్టు 2 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ టైటిల్ గెలవడానికి దక్షిణాఫ్రికా ఇప్పుడు కేవలం 69 పరుగుల దూరంలో ఉంది.

WTC 2025 Final: 27 ఏళ్ల కలకు 69 అడుగుల దూరం.. హిస్టరీ మార్చేందుకు సిద్ధమైన బ్యాడ్ లక్ టీం..
Wtc 2025 Final

Updated on: Jun 14, 2025 | 2:42 PM

South Africa vs Australia, WTC 2025 Final: 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ టైటిల్ గెలవడానికి దక్షిణాఫ్రికా ఇప్పుడు కేవలం 69 పరుగుల దూరంలో ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో, మూడవ రోజు ముగిసే సమయానికి జట్టు 2 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా జట్టు 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే.

నాల్గవ రోజు ఆట లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా అర్ధశతకం సాధించగా, వైస్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ సెంచరీ సాధించారు. ఇద్దరూ తమ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు.

కాగా, బుధవారం దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 212 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 138 పరుగులు చేసింది. కంగారూ జట్టుకు 74 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 218 పరుగులు చేసింది. అందువల్ల దక్షిణాఫ్రికా ముందు 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐడెన్ మార్క్రమ్ సెంచరీ..

ఆస్ట్రేలియా మూడో రోజు ఆటను 144/8 స్కోరుతో ప్రారంభించింది. మిచెల్ స్టార్క్ అర్ధ సెంచరీ సాధించాడు. 10వ వికెట్‌కు జోష్ హేజిల్‌వుడ్‌తో కలిసి 59 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకుని జట్టును 218 పరుగులకు చేర్చాడు. 282 పరుగుల లక్ష్యం ముందు దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్రామ్ సెంచరీ చేశాడు.

రెండో రోజు దక్షిణాఫ్రికా 138 పరుగులకు ఆలౌట్..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 218 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 74 పరుగుల ఆధిక్యంలో ఉంది. గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఉదయం 43/4 స్కోరుతో ఆటకు దిగిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకు ఆలౌట్ అయింది.

తొలి రోజు ఆస్ట్రేలియా 169 పరుగుల ఆధిక్యం..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా బలమైన ఆరంభం చేసింది. బుధవారం మ్యాచ్ తొలి రోజు ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసింది. అలాగే, దక్షిణాఫ్రికాకు చెందిన నలుగురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపారు. మిచెల్ స్టార్క్ 2 వికెట్లు, పాట్ కమ్మిన్స్, జోష్ హేజిల్‌వుడ్ తలా ఒక వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా 43/4 స్కోరుతో రోజు ఆటను ముగించింది.

రెండు జట్ల ప్లేయింగ్-11..

దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వేరియన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి.

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుస్చాగ్నే, కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..