Sourav Ganguly: కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. ఓవైపు ఇంకా డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య కొనసాగుతున్న సమయంలోనే ఒమిక్రాన్ పంజా విసురుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. గత సోమవారం కాస్త అనారోగ్యంతో ఉన్న గంగూలీకి పరీక్షలు చేయించడంతో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కోల్‌కతాలోని వుడ్‌లాండ్స్ ఆసుపత్రిలో చేరారు.
ఒమిక్రాన్ పరీక్షలు నిర్వహించడంతో నెగిటివ్‌గా తేలింది. అనంతరం కరోనా నుంచి కోలుకున్న గంగూలీని వైద్యులు శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. అయితే పూర్తిగా కోలుకునేంత వరకు ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. ఈ క్రమంలోనే తాజాగా గంగూలికి వైద్యులు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో మరోసారి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈసారి నిర్వహించిన పరీక్షలో గంగూలీకి డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే ఇన్ఫెక్షన్ తీవ్రత ఆందోళన చెందే స్థాయిలో లేకపోవడంతో ఆయనకు ఇంటి వద్దే చికిత్స అందిస్తున్నారు. మరో 15 రోజుల పాటు గంగూలీ వైద్యుల పర్యవేక్షణలో హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు.
Also Read: India Corona: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా, ఒమిక్రాన్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
BheemlaNayak: దుమ్మురేపిన “లాలా భీమ్లా.. డిజే వెర్షన్.. సోషల్ మీడియాను షేక్ చేసిన పాట