Sourav Ganguly: 8 ఏళ్ల కరవును తీర్చేందుకే ధోనీని మెంటార్‌గా తీసుకున్నాం: బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ

T20 World Cup: ధోనీని మెంటార్‌గా చేయాలనే బీసీసీఐ నిర్ణయాన్ని చాలా మంది ప్రశంసించారు. కానీ, ఈ నిర్ణయం వెనుక బీసీసీఐ ఆలోచన ఏమిటనేది మాత్రం చాలా మందికి ఓ ప్రశ్నలా మారింది.

Sourav Ganguly: 8 ఏళ్ల కరవును తీర్చేందుకే ధోనీని మెంటార్‌గా తీసుకున్నాం: బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ
Ganguly Dhoni
Follow us
Venkata Chari

|

Updated on: Sep 14, 2021 | 2:03 PM

MS Dhoni: టీ 20 వరల్డ్ కప్ కోసం టీమిండియా ప్రకటన చేసి ఇప్పటికే కొన్ని రోజులు గడిచాయి. జట్టు ఎంపికైనప్పుడు, అశ్విన్ ఎంపిక వార్తల్లో నిలిచింది. యుజ్వేంద్ర చాహల్, శిఖర్ ధావన్ లకు చోటు దక్కకపోవడం కూడా చర్చల్లోకి వచ్చింది. కానీ, ధోనీని టీమ్‌కి మెంటార్‌గా తీసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. మరోవైపు ప్రశంసించిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ, ఈ నిర్ణయం వెనుక బీసీసీఐ ఆలోచన ఏమిటనేది మాత్రం చాలామందికి ఓ ప్రశ్నాలా తయారైంది. బోర్డు చైర్మన్ సౌరవ్ గంగూలీ ఏమి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు? అంటూ ఆరాలు తీయండ మొదలు పెట్టారు. తాజాగా గంగూలీ ఈ సమస్యకు సమాధానం ఇచ్చారు.

సౌరవ్ గంగూలీ చాలా సూటిగా సమాధానమిచ్చాడు. ధోనీని గురువుగా మార్చడానికి గల కారణాన్ని వివరిస్తూ.. 2013 నుంచి ఐసీసీ ఈవెంట్లలో కొనసాగుతున్న కరువును అంతం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇంగ్లీష్ వార్తాపత్రిక ది టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ మాట్లాడుతూ “మేం తీసుకున్న నిర్ణయం టీ 20 ప్రపంచ కప్‌లో జట్టుకు ఎంతో సహాయపడుతుంది. టీ 20 ఫార్మాట్ క్రికెట్, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరపున ధోనీ రికార్డు బాగుంది. అతడిని మెంటార్‌గా చేసే నిర్ణయం ఎంతో జాగ్రత్తగా తీసుకున్నాం. మేము దీనిపై లోతుగా చర్చించాం. 2013 తర్వాత భారత్ ఐసీసీ ట్రోఫీని గెలవలేదు. ఈ విషయంలో ధోనీ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది” అని పేర్కొన్నాడు.

2013 నుంచి భారత్‌కు దక్కని ఐసీసీ టైటిల్ 2013లో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలుచుకుంది. ఆ టైంలో కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ ఉన్నాడు. ఇంగ్లండ్ గడ్డపై ఈ టోర్నమెంట్‌లో భారత్ విజయం సాధించింది. దీంతో దోని అనుభవాన్ని ఉపయోగించుకోవాలని బీసీసీఐ కోరకుంటోంది. ఈ సారి టీమిండియా యూఏఈలో టీ 20 ప్రపంచకప్ గెలవడానికి ధోని సేవలు ఉపయోగపడతాయని ఆశిస్తుంది.

ఆస్ట్రేలియా జట్టుకు వా ఎలాగో.. ధోనీ కూడా టీమిండియాకు అలానే.. ధోనీని మెంటార్‌గా చేయాలనే ఆలోచన ఆస్ట్రేలియా జట్టు నుంచి తీసుకున్నట్లు గంగూలీ వెల్లడించాడు. “ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ వాకు కూడా ఇలాంటి పాత్ర ఉంది. ఆటైంలో ఇంగ్లండ్ వెళ్లిన ఆసీసీ జట్టు యాషెస్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది” అని ఆయన అన్నాడు. సీనియర్ ఆటగాళ్లను జట్టుతో అనుబంధంగా ఉంచడం వల్ల టీంకు ఎంతో ప్రయోజనం ఉంటుందని బీసీసీఐ చీఫ్ అన్నారు.

Also Read: IPL 2021: కోహ్లీ టీం జెర్సీ మారింది.. కేకేఆర్‌తో పోరుకు మాత్రమేనట.. ఎందుకో తెలుసా?

Namanveer Singh Brar: భారత షూటర్ అనుమానాస్పద మృతి.. ఆత్మహత్యగా భావిస్తోన్న పోలీసులు..?