AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI vs ECB: ఇంగ్లండ్‌కు బంఫర్ ఆఫర్ ఇచ్చిన బీసీసీఐ.. మాంచెస్టర్ నష్టాన్ని ఆ విధంగా భర్తీ చేస్తామంటూ ప్రకటన

మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ రద్దు కారణంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ మొత్తం నష్టం విలువ దాదాపు రూ. 407 కోట్లు అని తెలుస్తోంది.

BCCI vs ECB: ఇంగ్లండ్‌కు బంఫర్ ఆఫర్ ఇచ్చిన బీసీసీఐ.. మాంచెస్టర్ నష్టాన్ని ఆ విధంగా భర్తీ చేస్తామంటూ ప్రకటన
Bcci
Venkata Chari
|

Updated on: Sep 14, 2021 | 2:26 PM

Share

BCCI vs ECB: మాంచెస్టర్‌లో జరగాల్సిన భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన టెస్ట్ సిరీస్ చివరి మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. కరోనాను దృష్టిలో ఉంచుకుని ఈ టెస్టును రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ రద్దు కారణంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చాలా నష్టపోయింది. ఓ అంచనా ప్రకారం, ఈ మొత్తం నష్టం రూ. 407 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ రద్దు తర్వాత ఈసీబీ ఈ మొత్తాన్ని బీసీసీఐ నుంచి డిమాండ్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో, భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి, జే షా ఇంగ్లండ్ నష్టాన్ని భర్తీ చేసేందుకు అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు.

జైషా ఇచ్చిన ఆఫర్ మేరకు భారత్‌తో ఇంగ్లండ్ టీ 2 టీ 20 లేదా ఒక టెస్ట్ మ్యాచ్ ఆడటం అని తెలుస్తోంది. వాస్తవానికి, వచ్చే ఏడాది భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉంది. ఆ పర్యటనలో భారత్ ఆడాల్సిన టీ20ల సంఖ్య కంటే మరో రెండు టీ20లు అదనంగా ఆడటం.. లేదా ఓ టెస్ట్ అదనంగా ఆడవచ్చనే ప్రతిపాదనను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. మర ఈసీబీ ఈ ఆఫర్‌ను అంగీకరిస్తుందా లేదో చూడాలి. ప్రస్తుతానికైతే బంతి ఈసీబీ కోర్టులో ఉందని ఆయన అన్నారు.

వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటనకు భారత్.. వచ్చే ఏడాది జులైలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ షెడ్యూల్ ప్రకారం, ఈ పర్యటనలో, టీమిండియా 3 టీ 20లు, 3 వన్డేలు ఆడాల్సి ఉంది. జులై 1 న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగే టీ 20 మ్యాచ్‌తో ఇంగ్లండ్ పర్యటన ప్రారంభమవుతుంది. రెండవ టీ 20 జులై 3 న ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరుగుతుంది. మూడో టీ 20 జులై 6 న జరుగుతుంది. దీని తరువాత, 3 వన్డేల సిరీస్ జులై 9, 12, 14 తేదీలలో జరుగుతాయి.

ఈసీబీకి అద్భుతమైన ఆఫర్ ఇచ్చాం: జై షా వచ్చే ఏడాది, టీమిండియా ఇంగ్లండ్ పర్యటన గురించి క్రిక్ బజ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా మాట్లాడుతూ.. “ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ ఓ ఆఫర్ ఇచ్చింది. వచ్చే ఏడాది జులైలో ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు, 3 టీ 20 లకు బదులు 5 టీ 20 ల సిరీస్ ఆడతాం. టీ20లు వద్దనుకున్నప్పుడు ఓ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకావం ఇచ్చాం. ఈ రెండు ఆఫర్‌లలో ఏది ఈసీబీ ఎంచుకుంటుందో చూడాలి’ అంటూ జైషా పేర్కొన్నారు.

Also Read: Sourav Ganguly: 8 ఏళ్ల కరవును తీర్చేందుకే ధోనీని మెంటార్‌గా తీసుకున్నాం: బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ

IPL 2021: కోహ్లీ టీం జెర్సీ మారింది.. కేకేఆర్‌తో పోరుకు మాత్రమేనట.. ఎందుకో తెలుసా?

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..