Sourav Ganguly Birthday: ఈ బెంగాల్ టైగర్ బ్యాట్‌కు పదునెక్కువ.. అందుకే ఈ రెండు రికార్డులు నేటికీ చెక్కుచెదరలేదు..

ourav Ganguly : భారత క్రికెట్‌ అభిమానులకు జులై 7,8 తేదీలు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే భారత క్రికెట్‌ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన ఇద్దరు కెప్టెన్లు ఈ తేదీల్లోనే పుట్టారు. వారే మహేంద్రసింగ్‌ ధోని, సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly).

Sourav Ganguly Birthday: ఈ బెంగాల్ టైగర్ బ్యాట్‌కు పదునెక్కువ.. అందుకే ఈ రెండు రికార్డులు నేటికీ చెక్కుచెదరలేదు..
Sourav Ganguly
Follow us
Basha Shek

|

Updated on: Jul 08, 2022 | 10:02 AM

Sourav Ganguly : భారత క్రికెట్‌ అభిమానులకు జులై 7,8 తేదీలు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే భారత క్రికెట్‌ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన ఇద్దరు కెప్టెన్లు ఈ తేదీల్లోనే పుట్టారు. వారే మహేంద్రసింగ్‌ ధోని, సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly). గురువారం (జులై 7) ధోని బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు ఫ్యాన్స్. ఈరోజు (జులై8) సౌరవ్ పుట్టిన రోజు. ఈక్రమంలో పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు దాదాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో తన బ్యాటింగ్‌లో పరుగులు, రికార్డుల వర్షం కురిపించిన గంగూలీకి ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే అతను ఇది అతనికి 50వ పుట్టిన రోజు.

అందుకే దాదా అయ్యాడు..

సౌరవ్ గంగూలీ మొత్తం దాదాపు 17 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలు అందించారు. ఆటగాడిగానే కాకుండా నాయకుడిగా టీమిండియాకు ఎన్నో మధురమైన విజయాలు అందించాడు. ఈక్రమంలోనే వ్యక్తిగతంగా ఎన్నో మైలురాళ్లు, రికార్డులు అందుకున్నాడు. ఈక్రమంలో 25 ఏళ్ల క్రితం బెంగాల్‌ టైగర్‌ సాధించిన రెండు రికార్డులు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

ఇవి కూడా చదవండి

అంతర్జాతీయ క్రికెట్‌లో దాదా రికార్డులివే..

  • సౌరవ్ గంగూలీ లార్డ్స్ టెస్టులో సెంచరీతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అయితే అతను వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ సెంచరీ సాధించాడు. తద్వారా మహ్మద్ అజారుద్దీన్ (3) తర్వాత ఆ ఘనత సాధించిన రెండో భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు.
  • గంగూలీ తన కెరీర్‌లో మొత్తం 113 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 42 సగటుతో 7212 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు ఉన్నాయి. సౌరవ్‌ కెరీర్ ముగిసే వరకు అతని టెస్ట్ బ్యాటింగ్ సగటు ఎప్పుడూ 40 కంటే తక్కువగా నమోదుకాలేదు.
  • బెంగళూరు వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో 239 పరుగులు చేశాడు దాదా. ఇదే అతని ఏకైక డబుల్ సెంచరీ. భారత్ తరఫున ఓ ఎడమచేతి వాటం బ్యాటర్‌ సాధించిన అత్యధిక టెస్టు స్కోరు ఇదే.
  • గంగూలీ తన టెస్ట్ కెరీర్‌లో మొత్తం 16 సెంచరీలు సాధించాడు. ఈ మ్యాచ్‌లన్నింటిలోనూ టీమిండియా విజయాలు సాధించడం విశేషం.
  • గంగూలీ వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గా పరిగణిస్తారు. పరుగులు, సెంచరీల పరంగా ఒకానొక సమయంలో అతను మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్‌తో పోటీ పడ్డాడు. 1999 ప్రపంచ కప్‌లో శ్రీలంకపై 183 పరుగులు చేసిన గంగూలీ.. ప్రపంచ కప్‌లో టీమిండియా తరఫున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
  • ఇక ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ నిలిచాడు. 2003 ప్రపంచకప్‌లో అతను 3 సెంచరీలు సాధించాడు.
  • 25 ఏళ్ల క్రితం టోరంటోలో పాకిస్తాన్‌పై గంగూలీ సాధించిన రెండు రికార్డులు ఇప్పటి వరకు బద్దలు కాలేదు. అందులో మొదటిది, ప్రపంచ క్రికెట్‌లో వరుసగా 4 వన్డేల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకోవడం. 1997లో టొరంటోలో పాక్‌తో జరిగిన సహారా కప్‌ టోర్నమెంట్లో గంగూలీ ఈ ఘనత సాధించాడు.
  • ఇక ఇదే టోర్నీలో ఓ మ్యాచ్‌లో గంగూలీ 10 ఓవర్లలో 16 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. పాక్‌పై ఓ టీమిండియా బౌలర్‌ చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం ఇదే విశేషం. ఈ రికార్డు కూడా ఇప్పటివరకు చెక్కుచెదరలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..