Smriti Mandhana: స్మృతి కాబోయేవాడితో ఉన్న ఈ అమ్మాయ్ ఎవరు.! పలాష్ ఇంత పెద్ద చీటరా.? వైరల్ ఫోటోలు

భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్‌ డైరెక్టర్‌ పలాశ్‌ ముచ్చల్‌ వివాహం వాయిదా పడింది. పెళ్లి వేడుకల్లో పాల్గొంటుండగా మంధాన తండ్రి గుండెపోటు లక్షణాలతో ఇబ్బందిపడ్డారు. దీంతో ఆయన్ను వెంటనే సాంగ్లీలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఇప్పుడు కొత్త ట్విస్ట్ బయటపడింది.

Smriti Mandhana: స్మృతి కాబోయేవాడితో ఉన్న ఈ అమ్మాయ్ ఎవరు.! పలాష్ ఇంత పెద్ద చీటరా.? వైరల్ ఫోటోలు
Smriti Mandhana

Updated on: Nov 25, 2025 | 1:13 PM

భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్‌ డైరెక్టర్‌ పలాశ్‌ ముచ్చల్‌ వివాహం వాయిదా పడింది. పెళ్లి వేడుకల్లో పాల్గొంటుండగా మంధాన తండ్రి గుండెపోటు లక్షణాలతో ఇబ్బందిపడ్డారు. దీంతో ఆయన్ను వెంటనే సాంగ్లీలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో పెళ్లిని వాయిదా వేసుకున్నారు స్మృతి మంధాన. పెళ్లి కొడుకు తరపున వారు చెప్పినా ఆమె తండ్రి ఆరోగ్యమే ముఖ్యమని చెప్పడంతో.. పెళ్లి ఆగిపోయింది. అయితే అదేరోజు రాత్రి పలాశ్‌ ముచ్చల్‌ కూడా అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైరల్ ఇన్ఫెక్షన్, అసిడిటీ వల్ల అతడు ఇబ్బంది పడ్డాడని వైద్యులు వెల్లడించారు. చికిత్స అనంతరం పలాశ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే ఈ విషయానికి సంబంధించి పలాశ్‌ సోదరి పలాక్‌ ముచ్చల్‌ ఇన్‌స్టా వేదికగా స్టోరీ షేర్‌ చేశారు. ‘స్మృతి మంధాన నాన్నగారికి అనారోగ్యం కారణంగా, మంధాన, పలాశ్‌ వివాహం ప్రస్తుతానికి ఆగిపోయింది. ఈ సమయంలో అందరూ ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నానంటూ పోస్ట్‌ చేశారు.

తండ్రి అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన్ను సాంగ్లీలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మంధాన స్పష్టంగా చెప్పింది. అందుకే వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుందని ఆమె మేనేజర్ చెప్పారు. మెహందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత మహిళా క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, షెఫాలీ వర్మ, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్‌ పాల్గొని సందడి చేశారు. అయితే నిన్న స్మృతి మంధాన సోషల్‌ మీడియా నుంచి పెళ్లికి సంబంధించిన అన్ని వీడియోలను డిలీట్‌ చేశారు. అటు పలాష్ మరో అమ్మాయితో ఉన్న ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిన్నింటి మధ్య స్మృతి ఇలా ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయడంతో అభిమానులు ఇప్పటికే కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి నిజంగా వాయిదా పడిందా? రద్దైందా అనే విషయంపై చర్చ జరుగుతోంది.