Smriti Mandhana: రైట్ హ్యాండ్‌ నుంచి లెఫ్ట్ హ్యాండర్‌గా మారిన లేడీ కోహ్లీ.. వామ్మో, బ్యాక్ గ్రౌండ్‌లో ఇంత జరిగిందా..

|

Jul 18, 2024 | 3:18 PM

Smriti Mandhana Birthday: స్మృతి మంధాన.. భారత మహిళా క్రికెట్ సూపర్ స్టార్. ఈ స్టైలిష్ ఎడమచేతి వాటం ప్లేయర్ మైదానంలో ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో వార్తల్లో నిలిచిపోతుంది. మైదానం వెలుపల పలాష్ ముచ్చల్‌తో ఆమె సాన్నిహిత్యంతోనూ వార్తల్లో నిలుస్తోంది. స్మృతి మంధాన.. భారత మహిళా క్రికెట్ సూపర్ స్టార్. ఈ స్టైలిష్ ఎడమచేతి వాటం ప్లేయర్ మైదానంలో ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో వార్తల్లో నిలిచిపోతుంది. మైదానం వెలుపల పలాష్ ముచ్చల్‌తో ఆమె సాన్నిహిత్యంతోనూ వార్తల్లో నిలుస్తోంది.

Smriti Mandhana: రైట్ హ్యాండ్‌ నుంచి లెఫ్ట్ హ్యాండర్‌గా మారిన లేడీ కోహ్లీ.. వామ్మో, బ్యాక్ గ్రౌండ్‌లో ఇంత జరిగిందా..
Smriti Mandhana Birthday Sp
Follow us on

Smriti Mandhana Birthday: స్మృతి మంధాన.. భారత మహిళా క్రికెట్ సూపర్ స్టార్. ఈ స్టైలిష్ ఎడమచేతి వాటం ప్లేయర్ మైదానంలో ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో వార్తల్లో నిలిచిపోతుంది. మైదానం వెలుపల పలాష్ ముచ్చల్‌తో ఆమె సాన్నిహిత్యంతోనూ వార్తల్లో నిలుస్తోంది. పలాష్ వృత్తిరీత్యా సినీ పరిశ్రమతో అనుబంధం కలిగి ఉన్నాడు. స్మృతి మంధానకు ప్రియుడు కూడా. తాజాగా ఈ విషయాన్ని ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ద్వారా ధృవీకరించారు. ఇన్‌స్టా పోస్ట్‌లో, స్మృతి, పలాష్ ఇద్దరూ 5 సంవత్సరాల నుంచి రిలేషన్‌లో కలిసి ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. అయితే, స్మృతి మంధాన కెరీర్ విషయంలో ఆమె సోదరుడిని ఏమాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే స్మృతి ఈరోజు ఇలా ఎదగడానికి కీలక పాత్ర పోషించింది ఆయనే.

స్మృతి మంధాన కుటుంబంలో ప్రతి ఒక్కరికీ క్రికెట్‌తో అనుబంధం ఉంది. అంటే స్మృతికి ముందు ఆమె తండ్రి, సోదరుడు అందరూ క్రికెట్ ఆడినవారే. స్మృతి తండ్రి జిల్లా స్థాయి వరకు క్రికెట్ ఆడారు. ఆమె సోదరుడు శ్రవణ్ మంధాన మహారాష్ట్ర అండర్ 19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

స్మృతి మంధానను క్రికెటర్‌గా నిలబెట్టడంలో సోదరుడి పాత్ర కీలకం..

స్మృతి మంధాన క్రికెట్‌పై ఇష్టపడటానికి కారణం ఆమె సోదరుడు శ్రవణ్. శ్రవణ్ ప్రాక్టీస్ కోసం గ్రౌండ్‌కి వెళ్లినప్పుడల్లా అతనితో పాటు స్మృతి కూడా వెళ్లేది. ఆపై ఒక రోజు తన సోదరుడు ఆడే విధంగా తాను కూడా ఆడగలనని అనుకుంది. ఫలితంగా ఈరోజు క్రికెట్ ఆడుతూ స్మృతి ఎక్కడికి చేరిందో మనకు తెలిసిందే.

ఇవి కూడా చదవండి

కుడిచేతి వాటం స్మృతి.. ప్రస్తుతం ఎడమ చేతితో ఎందుకు ఆడుతుంది?

స్మృతి మంధాన క్రికెట్‌లో తన సోదరుడిని ఎంతగానో అనుసరించింది. కుడిచేతి వాటం అయినప్పటికీ, ఆమె కూడా తన సోదరుడిలాగే ఎడమ చేతితో అలవాటు చేసుకుంది. దీని వెనుక ఉన్న కారణాన్ని స్మృతి మంధాన కూడా ఓ ఇంటర్వ్యూలో వివరించింది. తన తండ్రికి ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అంటే చాలా ఇష్టమని, దాని వల్లే తాను, తన సోదరుడు ఇద్దరూ ఎడమచేతి వాటంగా మారామని చెప్పుకొచ్చింది.

స్మృతి కోసం రాహుల్ ద్రవిడ్‌కు ఆమె సోదరుడి అభ్యర్థన..

అయితే, స్మృతి మంధాన జీవితం మారిపోవడానికి సోదరుడే కాదు.. అందుకు రాహుల్ ద్రవిడ్‌కు వచ్చిన అభ్యర్థన కూడా ఓ కారణమైంది. ఈ విషయాన్ని స్వయంగా స్మృతి మంధాన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తనకు బ్యాట్ ఇవ్వగలరా అంటూ తన సోదరుడు శ్రవణ్ రాహుల్ ద్రవిడ్ సర్‌ని అభ్యర్థించాడు. రాహుల్ సార్ బ్యాట్ ఇవ్వడమే కాకుండా తన సోదరుడి అభ్యర్థన మేరకు దానిపై తన పేరు కూడా రాశారని స్మృతి తెలిపింది. అప్పుడు సోదరుడు ఆ బ్యాట్‌ని తనకు బహుమతిగా ఇచ్చాడని తెలిపింది.

స్మృతి ప్రకారం, మొదట ఆ బ్యాట్‌పై రాహుల్ ద్రవిడ్ ఆటోగ్రాఫ్ ఉన్నందున ఆమె దానిని షోపీస్‌గా ఉంచుకుంది. కానీ, టీమ్ ఇండియాలో ఎంపికైన వెంటనే ఆ బ్యాట్‌తో ఆడడం మొదలుపెట్టింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..