Watch Video: రూల్స్ బ్రేక్ చేసి, ఏడాది నిషేధంతో దూరమయ్యాడు.. కట్ చేస్తే.. జట్టును సూపర్ 12 చేర్చి హీరోగా నిలిచాడు..

|

Oct 20, 2022 | 1:39 PM

Sri Lanka vs Netherlands: కుశాల్ మెండిస్, వనేందు హసరంగ శ్రీలంకను విజయపథంలో నడిపించి, టీ20 ప్రపంచకప్‌లో నిలిచేలా చేశారు. దీంతో ఆసియా కప్ విజేత ఎట్టకేలకు సూపర్ 12 చేరి, ఊపిరి పీల్చుకుంది.

Watch Video: రూల్స్ బ్రేక్ చేసి, ఏడాది నిషేధంతో దూరమయ్యాడు.. కట్ చేస్తే.. జట్టును సూపర్ 12 చేర్చి హీరోగా నిలిచాడు..
Sri Lanka Vs Netherlands
Follow us on

తొలి మ్యాచ్ లో నమీబియా చేతిలో ఓడిన శ్రీలంక జట్టు ఎట్టకేలకు తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో తన సత్తా చాటింది. తన చివరి మ్యాచ్ అంటే గురువారం నాడు నెదర్లాండ్స్‌ను ఓడించిన శ్రీలంక టీ 20 ప్రపంచకప్‌లో సూపర్-12లోకి ప్రవేశించింది. శ్రీలంక ఈ విజయంలో ఓపెనర్ కుశాల్ మెండిస్, లెగ్ స్పిన్నర్ వనేందు హసరంగ హీరోలుగా నిలిచారు. కుశాల్ మెండిస్ అద్భుత అర్ధ సెంచరీతో 79 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్‌లో వనేందు హసరంగ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. నెదర్లాండ్స్ తరపున మాక్స్ ఆడ్ హాఫ్ సెంచరీ చేశాడు. కానీ అతను జట్టును గెలిపించలేకపోయాడు. ఈ విజయంతో శ్రీలంక సూపర్-12 రౌండ్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.

కుశాల్ మెండిస్ మాయాజాలం..

శ్రీలంక వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్ జట్టు విజయానికి హీరోగా నిలిచాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ 5 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 79 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 179 కంటే ఎక్కువగా ఉంది. అతని ఇన్నింగ్స్ కారణంగా శ్రీలంక 162 పరుగులు చేసింది. ఆ తర్వాత శ్రీలంక బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి నెదర్లాండ్స్‌ను 146 పరుగులకే పరిమితం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్ పర్యటనలో బయో బబుల్‌ను బద్దలు కొట్టి జట్టు నుంచి తొలగించబడిన కుసాల్ మెండిస్.. నేడు అదే జట్టును కీలక సమయంలో ఆదుకుని, టీ20 ప్రపంచ కప్ 2022లో సూపర్ 12కు చేర్చాడు. అంతేకాదు అతడిపై ఏడాది నిషేధం కూడా విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కీలక మ్యాచ్‌లో మెండిస్ అద్భుతంగా రాణించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

బౌలింగ్‌లో హసరంగా..

శ్రీలంక జట్టులోని ఈ లెగ్ స్పిన్నర్ మరోసారి 3 వికెట్లు పడగొట్టాడు. అతను అకెర్‌మన్, గుగ్గెన్, క్లాసెన్‌ల వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు మహిష్ తీక్షణ 2 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన ఆధారంగా శ్రీలంక అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యే సూపర్ 12లో ఆడుతుంది.