IND vs SL 2nd Test: రెండో టెస్టుకు ముందు లంక జట్టులో 2 మార్పులు.. ఎందుకో తెలుసా?

India vs Sri Lanka 2nd Test: భారత్, శ్రీలంకల మధ్య కీలకమైన రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి కొలంబోలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక జట్టులో ప్రధాన మార్పులు జరిగాయి. గాయం కారణంగా కుసల్ మెండిస్ జట్టుకు దూరమవ్వగా, ఐసీసీ నిబంధనల ప్రకారం దినేష్ చండిమాల్ జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో కమీల్ మిశ్రా, సహన్ అరాచీ జట్టులోకి వచ్చారు. సిరీస్ గెలవడానికి ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం.

IND vs SL 2nd Test: రెండో టెస్టుకు ముందు లంక జట్టులో 2 మార్పులు.. ఎందుకో తెలుసా?
Ind Vs Sl 2nd Test

Updated on: Aug 22, 2026 | 8:30 AM

India vs Sri Lanka 2nd Test: భారత్, శ్రీలంకల మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని రెండవ, చివరి మ్యాచ్ ఆగస్టు 23, అంటే ఈ ఆదివారం, కొలంబో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఎందుకంటే, ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలిస్తే, సిరీస్ సొంతమవుతుంది. మరోవైపు, శ్రీలంక గెలిస్తే, సిరీస్ 1-1 డ్రాగా ముగుస్తుంది. అందువల్ల, ఇరు జట్లు గెలవాలనే ఉద్దేశంతోనే మైదానంలోకి దిగుతాయి. అయితే, ఈ మ్యాచ్‌కు మరో రోజు మాత్రమే మిగిలి ఉండగా, శ్రీలంక జట్టులో రెండు ముఖ్యమైన మార్పులు జరిగాయి.

ఇద్దరు ఔట్.. ఇద్దరు ఇన్..

రెండో టెస్టుకు శ్రీలంక జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లు దూరమైతే, వారి స్థానంలో ఇద్దరు ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. గాయం కారణంగా కుసల్ మెండిస్ చివరి టెస్టుకు దూరమైతే, ఐసీసీ నిబంధనల వల్ల దినేష్ చండిమాల్ కూడా చివరి టెస్టు ఆడలేడు. అందువల్ల, అతని స్థానంలో కమీల్ మిశ్రా, ఆల్‌రౌండర్ సహాన్ అరాచీలను జట్టులోకి తీసుకున్నారు. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన పతుమ్ నిస్సంక కూడా రెండో టెస్టులో ఆడతాడో లేదో సందేహాస్పదంగా ఉంది.

ఎక్కువమంది చదివినది: ఏడాది పాటు నిషేధం.. కట్‌చేస్తే.. 11 ఫోర్లు, 11 సిక్సర్లు.. 72 బంతుల్లో రికార్డుల ఊచకోత..!

ఇవి కూడా చదవండి

కమిల్ మిశ్రా, సహన్ అరాచ్చికి అవకాశం..

వాస్తవానికి, కుసల్ మెండిస్ తొడ కండరాల గాయం కారణంగా మొదటి టెస్టుకు దూరమయ్యాడు. అయితే, అతను రెండో టెస్టు మ్యాచ్‌కు ఫిట్‌గా ఉంటాడని భావించారు, కానీ అలా జరగలేదు. అందుకే, అతన్ని జట్టు నుంచి తొలగించారు. ఇదిలా ఉండగా, గాలే టెస్టు మ్యాచ్ సందర్భంగా దినేష్ చండిమాల్ గాయపడ్డాడు. అందుకే, కంకషన్ రీప్లేస్‌మెంట్‌గా పసిందు సూర్యబందరను జట్టులోకి తీసుకున్నారు. ఐసీసీ కంకషన్ నిబంధనల ప్రకారం, దినేష్ రెండో మ్యాచ్‌లో ఆడలేడు. ఎందుకంటే, గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆటగాడు కనీసం ఏడు రోజుల పాటు జట్టులో ఆడలేడు. అందువల్ల, చండిమాల్ చివరి టెస్టులో ఆడలేడు.

ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడని సహాన్ అరచ్చి, భారత్‌తో జరిగే రెండో టెస్ట్ కోసం శ్రీలంక జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, అంతకుముందు భారత్ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక ‘ఎ’ తరపున సహాన్ బాగా ఆడాడు. ఆ రెండో మ్యాచ్‌లో అతను 127 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇదిలా ఉండగా, ఈ లంక ప్రీమియర్ లీగ్ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన కమీల్ మిశ్రాకు కూడా అవకాశం కల్పించారు.

ఎక్కువమంది చదివినది: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో వైభవ్‌కు చోటు.. ఓపెనర్లుగా ఎవరంటే?

2వ టెస్టుకు శ్రీలంక జట్టు: ధనంజయ డి సిల్వ (కెప్టెన్), లహిరు ఉదార, కమిల్ మిశ్రా, పసిండు సూరియబండార, కమిందు మెండిస్, సహన్ అరాచ్చిగే, సోనల్ దినూషా, నిరోషన్ డిక్వెల్లా, కేశర నువంత, ప్రభాత్ జయసూర్య, మిలన్ రత్నాయకే, లహిరు కుమార, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us