Team India : వరల్డ్ కప్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై సూర్య కీలక అప్‌డేట్

Team India : టీ20 వరల్డ్ కప్ 2026 సమరం మొదలవ్వడానికి కేవలం కొద్దిరోజుల సమయం మాత్రమే ఉంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది.

Team India : వరల్డ్ కప్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై సూర్య కీలక అప్‌డేట్
Tilak Varma Washington Sundar

Updated on: Feb 01, 2026 | 2:59 PM

Team India : టీ20 వరల్డ్ కప్ 2026 సమరం మొదలవ్వడానికి కేవలం కొద్దిరోజుల సమయం మాత్రమే ఉంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. అయితే ఈ సిరీస్‌కు దూరమైన స్టార్ ఆటగాళ్లు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ గురించి అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెరదించారు. కివీస్‌పై విజయం తర్వాత ఆయన వీరిద్దరి కోలుకుంటున్న తీరుపై కీలక అప్‌డేట్ ఇచ్చారు.

టీ20 వరల్డ్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్న భారత్, వరుసగా రెండోసారి కప్పు కొట్టాలన్న పట్టుదలతో ఉంది. అయితే ఈ ప్రయాణంలో తిలక్ వర్మ గాయం టీమ్ మేనేజ్‌మెంట్‌ను కాస్త కలవరపెట్టింది. దేశవాళీ క్రికెట్ ఆడుతున్న సమయంలో గాయపడిన తిలక్, ఒక చిన్న శస్త్రచికిత్స కూడా చేయించుకోవాల్సి వచ్చింది. దీనిపై సూర్య మాట్లాడుతూ..”తిలక్ వర్మ వేగంగా కోలుకుంటున్నాడు. అతను ముంబైలో ఫిబ్రవరి 2, 4 తేదీల్లో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడబోతున్నాడు. అతను ఇప్పటికే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ రెండు మ్యాచ్‌లు అతని ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి సరిపోతాయి. త్వరలోనే అతను మాతో కలుస్తాడు” అని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఫిట్‌నెస్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు. జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ సుందర్ పక్కటెముకలకు గాయమైంది. ఆ నొప్పి ఉన్నప్పటికీ అతను బ్యాటింగ్ చేసి కెఎల్ రాహుల్‌తో కలిసి భారత్‌ను గెలిపించాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ పూర్తి చేసుకుంటున్నాడు. సుందర్ గురించి సూర్య స్పందిస్తూ.. “వాషి కూడా చాలా బాగున్నాడు. అతనితో కూడా మాట్లాడాను. అతను కూడా నెట్స్‌లో బౌలింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అతను చాలా ఫిట్‌గా కనిపిస్తున్నాడు, త్వరలోనే జట్టులోకి వస్తాడనే నమ్మకం ఉంది” అని చెప్పారు.

వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీకి ముందు ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు అందుబాటులోకి రావడం భారత్‌కు పెద్ద ఊరటనిచ్చే అంశం. తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్‌లో పరుగుల వరద పారించగలడు, అటు సుందర్ తన ఆఫ్ స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగలడు. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ సమరానికి ఈ ఇద్దరు యంగ్ గన్స్ సిద్ధమవ్వడం ప్రత్యర్థి జట్లకు హెచ్చరిక లాంటిదే. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా ఇప్పుడు పూర్తి బలంతో విశ్వవిజేతగా నిలవడానికి కసరత్తులు చేస్తోంది.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..