ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్ నిలిచింది. 17 ఏళ్ల లీగ్ చరిత్రలో అత్యధిక బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకున్న తొలి జట్టుగా కూడా కేకేఆర్ అవతరించింది. వన్ సైడెడ్‌గా జరిగిన ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుచేసింది కేకేఆర్. SRH నిర్దేశించిన 114 పరుగుల స్వల్ప టార్గెట్‌ను కేవలం 10.3 ఓవర్లలోనే చేధించి.. ఐపీఎల్ ట్రోఫీని ముచ్చటగా మూడోసారి ముద్దాడింది. ఇక కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో ఆ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ ప్రధాన కారణం అని మాజీ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు అందరూ అతడిపై ప్రశంసలు కురిపిస్తుంటే.. గ్రౌండ్‌లో తనదైన మార్క్‌ను చూపించిన శ్రేయాస్ అయ్యర్ మాత్రం ఎవ్వరికీ కనిపించట్లేదు.
ఐపీఎల్ ఫైనల్ మాత్రమే కాదు.. నాకౌట్ మ్యాచ్‌లలోనూ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా గొప్ప పరిణితిని కనబరిచాడు. మెంటార్‌గా గంభీర్‌కు ఎంత క్రెడిట్ వెళ్లిందో.. శ్రేయాస్ అయ్యర్ కూడా అదే క్రెడిట్ దక్కించుకున్నాడని కొందరు అభిమానులు చెబుతున్నారు. బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్.. టీ20 ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఇంత బాధ ఉన్నప్పటికీ.. కేకేఆర్‌కు అన్నీ తానై.. కెప్టెన్‌గా గ్రౌండ్‌లో తిరుగులేని టీంని చేయగలిగాడు.
కాగా, కేకేఆర్ చివరిసారిగా 2014లో గంభీర్ సారధ్యంలో ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది. ఇక దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌ను నిలిపారు గంభీర్, శ్రేయాస్ అయ్యర్. ఈ సీజన్‌లో ఆడిన 14 ఇన్నింగ్స్‌ల్లో శ్రేయస్ అయ్యర్ 351 పరుగులు చేశాడు. ఈ విజయంతో శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌గా సరిగ్గా సూట్ అవుతాడని కొందరు అభిమానుల అభిప్రాయం.
To my entire KKR family, we’ve worked tirelessly for this moment. We’ve played for each other, we’ve sacrificed so much for each other, and it’s to get our hands on this prized trophy. To the owners, management, coaching staff, my teammates and the fans, from the bottom of my… pic.twitter.com/RRRQdsNpTZ
— Shreyas Iyer (@ShreyasIyer15) May 26, 2024
Special mention to the heartbeat of this team @iamsrk! Thank you for all your words of inspiration and encouragement 🏆💜 pic.twitter.com/Lkk4H06Tb2
— Shreyas Iyer (@ShreyasIyer15) May 26, 2024