Virat Kohli: వేలానికి విరాట్ కోహ్లీ జెర్సీ.. ప్రారంభ ధర ఎంతో తెలుసా?

|

Apr 27, 2022 | 4:41 PM

Kohli Jersey Auction: విరాట్‌కోహ్లీ.. పరిచయం అవసరం లేని పేరు. టీమిండియా కెప్టెన్‌గా, ఆటగాడిగా జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ఈ క్రికెట్‌ స్టార్‌కు ఫ్యాన్స్‌లో బోలెడంత ఫాలోయింగ్‌ ఉంది.

Virat Kohli: వేలానికి విరాట్ కోహ్లీ జెర్సీ.. ప్రారంభ ధర ఎంతో తెలుసా?
Kohli Jersey
Follow us on

Kohli Jersey Auction: విరాట్‌కోహ్లీ.. పరిచయం అవసరం లేని పేరు. టీమిండియా కెప్టెన్‌గా, ఆటగాడిగా జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ఈ క్రికెట్‌ స్టార్‌కు ఫ్యాన్స్‌లో బోలెడంత ఫాలోయింగ్‌ ఉంది. భారత క్రికెట్‌లో సచిన్‌, ధోని తర్వాత ఆ స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్నది కోహ్లీ అంటే అతిశయోక్తి కాదేమో. ఇక మార్కెట్లోనూ అతని బ్రాండ్‌ వ్యాల్యూ బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇంగ్లిష్‌ క్రికెట్‌ మీడియా విజ్డెన్‌ కింగ్ కోహ్లీ జెర్సీని వేలం వేయనుంది. ఈ మేరకు కోహ్లీ సంతకంతో కూడిన జెర్సీని ఒక ఫొటో ఫ్రేమ్‌లో పెట్టింది. ఇందులో జెర్సీతో పాటు కోహ్లికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్‌ ఫొటోలను కూడా ఉన్నాయి. ఆన్‌లైన్‌ పద్ధతిలో ఈ జెర్సీని వేలం వేయనున్నారు. వేలం పూర్తి వివరాలను విజ్డెన్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తెలుసుకోవచ్చు. కాగా కోహ్లి జెర్సీ ప్రారంభ ధరను 2499.99 పౌండ్లుగా(ఇండియన్‌ కరెన్సీలో దాదాపు రూ. 2.42 లక్షలు) నిర్ణయించారు(భారత కరెన్సీలో దాదాపు రూ. 2.42 లక్షలు). మరి కోహ్లీ జెర్సీని ఎవరు, ఎంత ధరకు కొనుగోలు చేస్తారో వేచి చూడాలి.

కాగా గత ఏడాది టీమిండియా కెప్టెన్‌గా వైదొలగిన విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్‌-2022లో బిజీగా ఉన్నాడు. ఆర్‌సీబీ తరఫున కేవలం ఆటగాడిగా మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే గత సీజన్లలో పరుగుల వరద పారించిన ఈ రన్‌ మెషిన్‌ ప్రస్తుతం మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 128 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు గోల్డెన్‌ డక్‌లు కూడా ఉన్నాయి. అయితే వీలైనంత త్వరలోనే కింగ్ కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడని, గతంలో లాగే మళ్లీ పరుగుల వరద పారిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 30న గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Priyamani: ఫ్లోరల్ ఫ్రాక్ లో ఢీ భామ.. ఆమె ఒంపుసొంపులకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Acharya Press Meet Photos: ఆచార్య ప్రెస్ మీట్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

KV Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటాతో సహా పలు కోటాలు రద్దు.. కొత్త మార్గదర్శకాలు విడుదల.