
ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) కోల్ కత్తా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన ఉత్కంఠ భరితమైన మ్యాచ్ అనంతరం, GT కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇషాంత్ శర్మ కుమార్తెతో విమానాశ్రయంలో ఆడుతూ కనిపించారు. ఈ మధుర క్షణం వీడియో వైరల్‌గా మారింది. అభిమానులు గిల్ చూపిన ఈ మానవీయ హృదయాన్ని ఎంతో మెచ్చుకున్నారు.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఏకపక్ష విజయాన్ని సాధించింది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ విభాగాల సమష్టి ప్రదర్శనతో ఐపీఎల్ 2025లో సత్తా చాటుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ విభాగంలో లోపాటు మరోసారి బహిర్గతమయ్యాయి. రాబోయే మ్యాచ్‌లలో కోల్‌కతా టీం ఎలా రాణిస్తుందో చూడాలి. గుజరాత్ టైటాన్స్ తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతుండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకునే దిశగా సాగుతోంది.
ఈడెన్ గార్డెన్స్‌లో నిన్న రాత్రి అంటే ఏప్రిల్ 21, 2025న జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మస్త్ మజా అందించింది. ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ 39 పరుగుల తేడాతో , కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించింది. ఈ విజయం గుజరాత్ టైటాన్స్‌కు పాయింట్ల పట్టికలో మరింత బలమైన స్థానాన్ని కల్పించగా, కోల్‌కతా నైట్ రైడర్స్ తమ ప్రదర్శనను మెరుగుపరచుకోకపోతే, ప్లేఆఫ్స్ నుంచి తప్పుకోవాల్సిందేనని హెచ్చరిస్తోంది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. గుజరాత్ తమ స్థిరమైన ఆటతీరుతో టేబుల్ టాపర్‌లుగా కొనసాగుతోంది. మరోవైపు, కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్‌లో ఓటమి పాలవడంతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలిచింది. దీంతో మరోసారి కేకేఆర్ కెప్టెన్సీతోపాటు ఆటగాళ్ల ప్రదర్శనలోని లోపాలను ఎత్తి చూపించింది.
విమానాశ్రయంలో శుభ్‌మన్ గిల్‌కు అభిమానం: తరువాతి మ్యాచ్ కోసం వెళ్లేందుకు గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు విమానాశ్రయానికి చేరుకోగా, అక్కడ గిల్ ఇషాంత్ శర్మ కుమార్తెతో ఆడుతూ కనిపించారు. ఈ సన్నివేశం అక్కడున్నవారి హృదయాలను గెలుచుకుంది. ఇషాంత్ శర్మ, మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి ప్రతిమా సింగ్ దంపతులకు 2023 నవంబర్ 3న పాప పుట్టింది.
గిల్ బ్యాటింగ్ ఫామ్: IPL 2025లో ఇప్పటివరకు గిల్ 8 మ్యాచ్‌లలో 300 లకు పైగా పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు అజేయంగా 90 పరుగులు. సాయి సుధర్శన్‌తో అతని ఓపెనింగ్ భాగస్వామ్యం గుజరాత్‌కు పెద్ద ప్లస్ అయ్యింది. GT ప్రస్తుతం 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
అత్యుత్తమ సమన్వయంతో ఆడుతున్న GT మాత్రం 8 మ్యాచ్‌లలో 6 విజయాలతో టాప్‌లో ఉంది. కెప్టెన్ గిల్, జోస్ బట్లర్, రదర్‌ఫోర్డ్ బ్యాటింగ్‌లో మెరుస్తుండగా, ప్రసీద్ క్రిష్ణా ఇటీవల 4 వికెట్లు తీసి బౌలింగ్ బలాన్ని పెంచాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.