Shubman Gill: ఆయన కారణంగానే జట్టులో ధైర్యంగా నిలబడగలిగాను.. మాజీ కెప్టెన్‌ను కీర్తించిన శుభ్మాన్ గిల్

మహేంద్ర సింగ్ ధోని.. క్రికెట్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు అది. సుదీర్ఘకాలం పాటు భారత క్రికెట్ జట్టుకు సారథ్య బాధ్యతలు వహించిన మహీకి చాలా కూల్ కెప్టెన్ అని కూడా పేరు ఉంది.  కేవలం మైదానంలోనే కాక డ్రెసింగ్ రూమ్‌లో కూడా జట్టు సభ్యులకు సలహాలు సూచనలనందించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఉంటాడు ఈ మాజీ కెప్టెన్. ఇది అందరికీ తెలిసిన విషయాలే. అయినా మళ్లీ మళ్లీ వినాలనిపించే మాటలు అవి. ఆ మాటలను […]

Shubman Gill: ఆయన కారణంగానే జట్టులో ధైర్యంగా నిలబడగలిగాను.. మాజీ కెప్టెన్‌ను కీర్తించిన శుభ్మాన్ గిల్
Ipl 2023 Shubman Gill

Updated on: Nov 21, 2022 | 8:48 AM

మహేంద్ర సింగ్ ధోని.. క్రికెట్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు అది. సుదీర్ఘకాలం పాటు భారత క్రికెట్ జట్టుకు సారథ్య బాధ్యతలు వహించిన మహీకి చాలా కూల్ కెప్టెన్ అని కూడా పేరు ఉంది.  కేవలం మైదానంలోనే కాక డ్రెసింగ్ రూమ్‌లో కూడా జట్టు సభ్యులకు సలహాలు సూచనలనందించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఉంటాడు ఈ మాజీ కెప్టెన్. ఇది అందరికీ తెలిసిన విషయాలే. అయినా మళ్లీ మళ్లీ వినాలనిపించే మాటలు అవి. ఆ మాటలను భారత జట్టులోని ఆటగాళ్లే చెప్తే.. మరింత సంతోషంగా ఉంటుంది కదా..అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది ఇప్పుడు. ఆ వీడియోలో.. తాను ధోని కారణంగానే జట్టులోకి రాగలిగానని, సమర్థవంతంగా నిలబడగలిగానని భారత యువ ఆటగాడు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అతనెవరో కాదు భారత యువ ఆటగాడు శుభమాన్  గిల్.

మూడేళ్ల కిందట న్యూజిలాండ్‌పైనే శుభ్‌మన్‌ గిల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. వన్డే అరంగేట్రం చేసిన గిల్‌  నిలకడగా రాణిస్తూ తుది జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ టీ20, వన్డే ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌ పర్యటనలోనే ఉంది. ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌తోనైనా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లోకి అడుగు పెడదామని గిల్‌ భావించాడు. కానీ అతడికి చోటు లభించకుండానే ఆట ముగిసింది. అయితే మంగళవారం జరగనున్న చివరి టీ20 మ్యాచ్‌లోనైనా అతనికి అవకాశం దక్కుతుందో లేదో తెలియాలంటే వేచి చూడక తప్పదు. ఈ క్రమంలోనే శుభ్‌మన్‌గిల్ ఓ ఇంటర్వ్యూలో తన వన్డే అరంగేట్రం గురించి గత జ్ఞాపకాలను పంచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్‌తో 2019లో వన్డే సిరీస్‌ కోసం అక్కడకు వెళ్లిన భారత్ ఘోరంగా ఓడిపోయింది. ధోని సారథ్యంలో గిల్‌ ఆడిన తన మొదటి మ్యాచ్‌లో టీమిండియా 92 పరుగులకే ఆలౌట్ కాగా అందులో అతను 9 పరుగులే చేశాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురైన తనను ఎంఎస్ ధోనీ ఓదారుస్తూ చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయని గిల్ తెలిపాడు. ‘‘ఆ రోజు నేను చాలా నిరుత్సాహానికి గురయ్యాను. అప్పటికి నా వయస్సు 19 ఏళ్లు మాత్రమే. అరంగేట్ర మ్యాచే ఇలా అయిందని బాధపడుతున్న నా దగ్గరకు ధోనీ భాయ్ వచ్చాడు. ‘బాధపడకు. నా కంటే నీ అరంగేట్రమే చాలా నయం’ అని అన్నాడు.


ఎందుకంటే బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌లో ధోనీ కేవలం ఒక్క బంతినే ఎదుర్కొని రనౌట్‌ రూపంలో డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ధోనీ ఎంతో సరదాగా నాతో మాట్లాడాడు. దీంతో  నా మూడ్‌ మారింది. గొప్ప స్థాయిలో ఉన్న ఆటగాడు ఇలా అండగా నిలుస్తాడని ఎవరూ ఆశించరు కదా.. అది నన్నెంతగానో అశ్చర్యపరచడమే కాక, నాకు బాగా నచ్చింది. నేను కూడా అతడిలా ఉండాలని కోరుకున్నా’’నని గిల్ గుర్తు చేసుకున్నాడు.