గంభీర్‌ వల్లే శ్రేయస్‌ అయ్యర్‌కు అన్యాయం జరిగింది! భారత దిగ్గజ మాజీ క్రికెటర్‌ సంచలన స్టేట్‌మెంట్‌

శ్రేయాస్ అయ్యర్‌కు 2024 ఐపీఎల్ విజయంలో కేకేఆర్‌ కోచ్ గౌతమ్ గంభీర్ కారణంగా సరైన క్రెడిట్ దక్కలేదని, అన్యాయం జరిగిందని సునీల్ గవాస్కర్ ఆరోపించారు. అయ్యర్ కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించినప్పటికీ, గంభీర్‌కే అంతా క్రెడిట్ దక్కిందని, అయ్యర్‌ను పక్కనబెట్టారని గవాస్కర్ విమర్శించారు.

గంభీర్‌ వల్లే శ్రేయస్‌ అయ్యర్‌కు అన్యాయం జరిగింది! భారత దిగ్గజ మాజీ క్రికెటర్‌ సంచలన స్టేట్‌మెంట్‌
Gautam Gambhir And Shreyas

Updated on: May 19, 2025 | 4:31 PM

టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్ గంభీర్ కారణంగానే స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు అన్యాయం జరిగిందంటూ భారత దిగ్గజ మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ట్రోఫీ సాధించడంతో కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ కీలక పాత్ర పోషించినప్పటికీ అతనికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదుని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. కానీ, కేకేఆర్‌ ఛాంపియన్‌గా నిలిచినందుకు గంభీర్‌కే క్రెడిట్‌ అంతా ఇచ్చారని, అయ్యర్‌ను పట్టించుకోలేదని అన్నారు.

గత ఏడాది కేకేఆర్‌కు మూడవ ఐపీఎల్‌ ట్రోఫీని అందించడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు, డొమెస్టిక్‌ క్రికెటర్‌లో ముంబై తరఫున మంచి ప్రదర్శన కనబర్చాడు, ఇప్పుడు ఐపీఎల్‌ 2025లో 2014 తర్వాత మొదటిసారి పంజాబ్ కింగ్స్‌ను ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. అయితే గత సీజన్‌లో ఐపీఎల్ విజయానికి అతనికి క్రెడిట్ దక్కలేదు. అన్ని ప్రశంసలు వేరొకరికి దక్కాయి. జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించేది కెప్టెన్, డగౌట్‌లో కూర్చున్న వ్యక్తి కాదు అని గవాస్కర్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో అన్నారు. “చూడండి, ఈ సంవత్సరం అతనికి మంచి క్రెడిట్ లభిస్తోంది. ఎవరూ రికీ పాంటింగ్‌కు పూర్తి క్రెడిట్ ఇవ్వడం లేదు ” అని గవాస్కర్ అన్నారు.

కాగా, శ్రేయస్‌ అయ్యర్‌ ఐపీఎల్‌ 2024లో కేకేఆర్‌ కెప్టెన్‌గా ట్రోఫీ గెలిచినప్పటికీ.. ఆ జట్టు నుంచి బయటికి వచ్చేశాడు. ఐపీఎల్‌ 2025 కోసం జరిగిన మెగా వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ అయ్యర్‌ను రూ.26.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ భారీ ధరకు ఇప్పటివరకు అయితే అయ్యర్ హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేస్తున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 50.63 సగటుతో 405 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. పైగా దాదాపు 11 ఏళ్ల తర్వాత పంజాబ్‌ కింగ్స్‌ ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. అది కూడా అయ్యర్‌ కెప్టెన్‌గా వచ్చిన తొలి సీజన్‌లోనే జరిగింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి