
Tilak Varma Health Update: న్యూజిలాండ్‌తో జరిగే మిగిలిన రెండు మ్యాచ్‌లకు భారత టీ20 జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కొనసాగుతారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్ జట్టుపై 2-0 ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌లకు గాయపడిన తిలక్ వర్మ స్థానంలో శ్రేయాస్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తిలక్ వర్మ ఇంకా పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్‌ను పొందలేదు. బీసీసీఐ ఎక్స్‌లెన్స్ సెంటర్ బెంగళూరులో రికవరీ అవుతున్నాడు. దీంతో మిగిలిన మ్యాచ్‌ల నుంచి తొలగించారు. దీంతో శ్రేయాస్ అయ్యర్ జట్టుతో ట్రావెల్ చేయనున్నాడు.
ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ “భారత బ్యాటర్ తిలక్ వర్మ శిక్షణను ప్రారంభించాడు. అయితే, పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్‌ను పొందడానికి మరింత సమయం పడుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్‌లోని చివరి రెండు టీ20ఐలకు అందుబాటులో ఉండడు” అని తెలిపాడు.
“ఫిబ్రవరి 3న తర్వాత తిలక్ ముంబైలో భారత జట్టుతో చేరనున్నాడు. అంటే, ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టు వార్మప్ మ్యాచ్‌కు ముందు జట్టుతో చేరనున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే మిగిలిన మ్యాచ్‌లకు తిలక్ వర్మ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ కొనసాగించాలని పురుషుల సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసింది” అని ఆయన తెలిపారు.
3 ఏళ్ల నుంచి ఒక్క మ్యాచ్ ఆడలే..
వన్డేల్లో వైస్ కెప్టెన్ అయిన అయ్యర్, న్యూజిలాండ్ జట్టుతో జరుగుతోన్న మ్యాచ్‌ల్లో ఇప్పటి వరకు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం సంపాదించలేదు. డిసెంబర్ 2023 నుంచి అతను ఒక్క టీ20ఐ కూడా ఆడలేదు.
భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ , సంజూ శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా , శివమ్ దూబే , అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్ , జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ , వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..