కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌.. ఆ చెత్త లిస్ట్‌లో నంబర్ 1గా శ్రేయాస్.. నెక్ట్స్ పేరు చూస్తే ఫ్యాన్స్ హర్ట్ అవ్వాల్సిందే?

Shreyas Iyer captaincy debut: తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవం, కెప్టెన్‌గా నమోదైన అవమానకర రికార్డు శ్రేయస్ అయ్యర్‌కు ఖచ్చితంగా కంటిమీద కునుకు లేకుండా చేసేవే. అయితే, ఈ సిరీస్‌లో నిలబడాలంటే భారత్‌కు ఇంకా అవకాశం ఉంది. ఆదివారం జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌లోనైనా అయ్యర్ తన బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీ వ్యూహాలను మార్చుకుని జట్టును విజయపథంలో నడిపిస్తాడేమో, ఈ విమర్శలకు గట్టి సమాధానం ఇస్తాడేమో చూడాలి.

కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌.. ఆ చెత్త లిస్ట్‌లో నంబర్ 1గా శ్రేయాస్.. నెక్ట్స్ పేరు చూస్తే ఫ్యాన్స్ హర్ట్ అవ్వాల్సిందే?
Shreyas Iyer Captaincy Debut Records

Updated on: Jun 27, 2026 | 4:55 PM

Shreyas Iyer captaincy debut: భారత క్రికెట్ జట్టు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుందన్న ఆశలతో ఐర్లాండ్ వేదికగా అడుగుపెట్టిన అభిమానులకు తొలి మ్యాచ్‌లోనే కోలుకోలేని నిరాశ ఎదురైంది. కొత్త సారథిగా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐర్లాండ్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బ్యాటింగ్ లైన్ అప్ కుప్పకూలడంతో, అయ్యర్ కెప్టెన్సీ ప్రస్థానం అత్యంత అవమానకరమైన ఓటమితో ప్రారంభమైంది.

ఐపీఎల్ హీరో.. అంతర్జాతీయ వేదికపై జీరో..!

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కప్పు అందించి, పంజాబ్ కింగ్స్ జట్టును విజయవంతంగా నడిపిన అనుభవం ఉండటంతో శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టుకు కెప్టెన్ అవుతుంటే అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ, శుక్రవారం జరిగిన మ్యాచ్ మాత్రం అతడికి ఒక పీడకలలా మారిపోయింది. జట్టును ముందుండి నడిపించాల్సిన కెప్టెన్.. కేవలం 3 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. మ్యాట్ హోలార్డ్ వేసిన లెగ్ సైడ్ బంతిని ఫ్లిక్ చేయబోయి డీప్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి అయ్యర్ పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు ఒత్తిడిలోకి జారుకుని మ్యాచ్‌ను చేజార్చుకుంది.

చరిత్రలో ఎవరికీ లేని అత్యంత ఘోరమైన రికార్డు..!

ఈ విఫలంతో శ్రేయస్ అయ్యర్ భారత క్రికెట్ చరిత్రలోనే ఒక అపకీర్తిని మూటగట్టుకున్నాడు. భారత టీ20 క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన ఏ ఆటగాడు కూడా సింగిల్ డిజిట్ (పది కంటే తక్కువ) పరుగులకు అవుట్ కాలేదు. గతంలో భారత జట్టుకు సారథ్యం వహించిన వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల నుంచి మొన్నటి శుభ్‌మన్ గిల్ వరకు అందరూ తమ మొదటి మ్యాచ్‌లో రెండంకెల స్కోరు సాధించారు. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం కేవలం 3 పరుగులకే పరిమితమై ఈ అవాంఛనీయ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇది కూడా చదవండి: IND vs IRE: ఐర్లాండ్ చేతిలో ఇప్పటి వరకు ఓడిపోని ‘3 టీంలు’.. లిస్ట్‌లో 2వ పేరు షాకింగ్ భయ్యో..!

కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు చేసిన రికార్డు సూర్యకుమార్ యాదవ్ (80 పరుగులు) పేరిట ఉండగా, కేఎల్ రాహుల్ (62 పరుగులు) కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. ధోనీ 33, కోహ్లీ 29, రోహిత్ 17 పరుగులతో రాణించారు. కానీ అయ్యర్ మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు.

జట్టులో స్థానమే ప్రశ్నార్థకమైన వేళ..

నిజానికి శ్రేయస్ అయ్యర్ 2023 తర్వాత భారత టీ20 జట్టులో చోటు కోల్పోయాడు. వరుసగా 2024, 2026 టీ20 ప్రపంచకప్ టోర్నీలకు అతడిని సెలెక్టర్లు పూర్తిగా పక్కన పెట్టేశారు. స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందనే కారణంతో జట్టుకు దూరమైన అయ్యర్, కష్టపడి దేశవాళీ క్రికెట్‌లో రాణించి మళ్లీ ఐర్లాండ్ పర్యటనతో జట్టులోకి వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అనూహ్యంగా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నప్పటికీ, పాత కథే మళ్లీ రిపీట్ అయింది. ఇప్పటివరకు ఆడిన 52 టీ20 మ్యాచ్‌లలో 135.33 స్ట్రైక్ రేట్‌తో 1107 పరుగులు చేసిన అయ్యర్, ఈ ఫార్మాట్‌లో తన నిలకడను నిరూపించుకోవడంలో మరోసారి వెనుకబడ్డాడు.

మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us