Team India: అయ్యర్‌కు డేంజర్ బెల్.. 3 ఛాన్స్‌ల్లో ఒకటి ఫెయిల్.. కొత్త కెప్టెన్ రెడీ చేసిన బీసీసీఐ..?

Team India Captaincy Debate: ఏది ఏమైనా ఇంగ్లాండ్ సిరీస్ శ్రేయస్ అయ్యర్ క్రికెట్ భవిష్యత్తుకు, కెప్టెన్సీకి చరమగీతం పాడుతుందా లేక అతను అద్భుతంగా పునరాగమనం చేస్తాడా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. భారత అభిమానులు మాత్రం తక్షణమే జట్టు ప్రదర్శనలో మార్పు రావాలని కోరుకుంటున్నారు.

Team India: అయ్యర్‌కు డేంజర్ బెల్.. 3 ఛాన్స్‌ల్లో ఒకటి ఫెయిల్.. కొత్త కెప్టెన్ రెడీ చేసిన బీసీసీఐ..?
Shreyas Iyer Captaincy In Danger Zone

Updated on: Jul 06, 2026 | 10:33 AM

Shreyas Iyer Captaincy: ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన భారత టీ20 జట్టుకు ఇప్పుడు అసలైన పరీక్ష ఎదురుకానుంది. ఇంగ్లాండ్ సిరీస్‌లోనైనా జట్టును గెలిపించి తన సారథ్య సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అగ్నిపరీక్షలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. వరుస ఓటములతో అయ్యర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తుండగా, శుభ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

ఐర్లాండ్ సిరీస్ ఘోర పరాభవం.. అయ్యర్ ట్రాక్ రికార్డ్ దారుణం..

ఐపీఎల్‌లో పంజాబ్ జట్టును నడిపించిన విధానం చూసి కొన్ని మీడియా సంస్థల అతి ప్రచారం వల్ల, సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోవడం వల్ల శ్రేయస్ అయ్యర్‌కు టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలు దక్కాయి. కానీ, అతను కెప్టెన్ అయినప్పటి నుండి భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం గమనార్హం. అయ్యర్ నాయకత్వంలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు ఓటములు చవిచూడగా, ఒక మ్యాచ్ వర్షార్పణమైంది. ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతిలో క్లీన్ స్వీప్ అవ్వడాన్ని సగటు భారత క్రికెట్ అభిమాని అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. ఐపీఎల్ చివరి ఆరు మ్యాచ్‌లలో కూడా అతను పంజాబ్‌కు ఒకే ఒక్క విజయాన్ని అందించాడు. అక్కడ మొదలైన అతని కెప్టెన్సీ ఫ్లాప్ షో ఇప్పుడు టీమిండియాలోనూ కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: ఇదెక్కడి దారుణం గంభీర్.. మంచోడిని పక్కనపెట్టి, అలాంటోడికి ఛాన్స్ ఇచ్చి, పరువు తీసుకున్నారుగా

ఇవి కూడా చదవండి

మళ్ళీ గుర్తొస్తున్న సూర్యకుమార్ యాదవ్ విజయాలు..

శ్రేయస్ అయ్యర్ అట్టర్ ఫ్లాప్ అవుతున్న తరుణంలో సోషల్ మీడియాలో మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (SKY) పేరు మారుమోగిపోతోంది. రోహిత్ శర్మ నిష్క్రమణ తర్వాత పగ్గాలు చేపట్టిన సూర్య నాయకత్వంలో భారత్ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లాంటి బలమైన జట్లను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి, 2026 టీ20 ప్రపంచకప్‌ను కూడా ముద్దాడేలా చేశాడు. సూర్య కెప్టెన్సీలో ఆడిన 52 మ్యాచ్‌లలో భారత్ కేవలం 8 మ్యాచ్‌లలో మాత్రమే ఓడిపోయింది. వ్యక్తిగత ప్రదర్శన సరిగ్గా లేదనే కారణంతో సెలెక్టర్లు సూర్యను పక్కనబెట్టినప్పటికీ, ఒక సారథిగా జట్టును నడిపించడంలో అతను వంద శాతం విజయవంతమయ్యాడని అభిమానులు గుర్తుచేస్తున్నారు.

ఇది కూడా చదవండి: వాడిని క్షమించను.. నమ్మి 7 నెలల తర్వాత ఛాన్స్ ఇస్తే నట్టేట ముంచాడు..

బీసీసీఐ పెట్టిన 3 టార్గెట్లు.. గిల్‌కు లైన్ క్లియర్?

వయసు రీత్యా, యువ ఆటగాళ్ల పోటీ వల్ల సూర్యకుమార్ యాదవ్ మళ్లీ జట్టులోకి రావడం కష్టమే అయినప్పటికీ, శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం శుభ్‌మన్ గిల్ రూపంలో పెద్ద ముప్పే పొంచి ఉంది. బీసీసీఐ మేనేజ్‌మెంట్ అయ్యర్ ముందు మూడు ముఖ్యమైన టార్గెట్లు పెట్టింది. అందులో మొదటిదైన ఐర్లాండ్ టూర్ ఇప్పటికే చేజారిపోయింది. ఇక మిగిలిన రెండు టార్గెట్లు ఇంగ్లాండ్ సిరీస్, ఆసియా క్రీడలు (ఏషియన్ గేమ్స్). ఒకవేళ ఈ రాబోయే ఇంగ్లాండ్ సిరీస్‌లో కూడా భారత్ ఓడిపోతే మాత్రం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఊడటం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే, యువ సంచలనం శుభ్‌మన్ గిల్‌ను అన్ని ఫార్మాట్లకు పూర్తిస్థాయి కెప్టెన్ చేసేందుకు బోర్డు సిద్ధంగా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us